Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 17 February 2022

మత బోధకుడి ముసుగులో వందల మందిపై అఘాయిత్యం: ఆ పార్ట్‌ బాగులేదని ఉలితో చెక్కి..

సైన్స్ రిసెర్చ్ ఫౌండేషన్‌కు నాయకత్వం వహిస్తూనే కరడుగట్టిన ముస్లిం బోధకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సామాజిక, రాజకీయ వైరుధ్యాలకు కారణాలను ఏకంగా ఓ శాటిలైట్ ఛానెల్‌ను నెలకొల్పి.. సెలబ్రిటీగా చెలామణి అవుతూ ఎంతో మంది అమ్మాయిలను ఆకర్షించి వారి జీవితాలతో ఆడుకున్న కామాంధుడి పాపం పండి చివరకు కటకటాలపాలయ్యాడు. వందల మందిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టర్కీ ఇస్లామిక్ కల్ట్ లీడర్ చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అతడి కబంధ హస్తాల్లో చిక్కుకుని, ఎంతటి నరకం అనుభవించిందీ బాధితులు వెల్లడిస్తున్నారు. మహిళలపై లైంగిక దోపిడీకి పాల్పడిన అద్నాన్ ఓక్టార్‌కు గత నెలలో న్యాయస్థానం 1000 ఏళ్ల జైలు శిక్ష విధించింది. A9TV పేరుతో శాటిలైట్ ఛానల్‌ను 2011 స్థాపించిన అద్నాన్ ఓక్టార్.. తన విశ్వాసాల ఆధారంగా పలు డాక్యుమెంటరీలను నిర్మించాడు. అందమైన యువతులతో కలిసి యుగాంతం గురించిన అనేక సిద్ధాంతాలను తన ఛానల్ ద్వారా ప్రసారం చేసేవాడు. ఛార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని ఖండిస్తూ తక్కువ కాలంలోనే సుప్రసిద్ధ వ్యక్తిగా మారాడు. హరున్ యహ్యా కలం పేరుతో అనేక పుస్తకాలను రాశాడు. ఈ క్రమంలోనే క్రూరమైన చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి హేయమైన చర్యలకు ఒడిగట్టాడు. సైన్స్ పరిశోధనలో ముసుగులో కామపిశాచిగా మారిపోయాడు. మైనర్లను బలవంతంగా నరకం కూపంలోని నెట్టి, లైంగికంగా వేధించాడు. వందలమందిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. రాజకీయ-సైనిక గూఢచర్యానికీ ప్రయత్నించాడు. అయితే అతడి పాపాల చిట్టా బయటపడటంతో సాక్ష్యాలతో సహా నిరూపితమయ్యాయి. దీంతో నిందితుడికి 1, 075 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడి నేరాలకు సహకరించిన 13 మంది సహాయకులకు కూడా ఇస్తాంబుల్ కోర్టు జైలు శిక్ష విధించింది. అద్నాన్ అఘాయిత్యాల గురించి కోర్టుకు వెల్లడించిన బాధితులు.. లైంగిక దాడి తర్వాత బలవంతంగా గర్భనిరోధక మాత్రలు వేయించేవాడని చెప్పారు. పోలీసులు ఓక్టార్ నివాసంపై దాడి చేసినప్పుడు దాదాపు 70,000 గర్భనిరోధక మాత్రలు కనుగొనడం గమనార్హం. ఒకప్పుడు ఓక్టార్ కామదాహానికి బలైపోయి, అతడి కబంధ హస్తాల నుంచి తప్పించుకుని ప్రస్తుతం కెనడాలో ఉంటున్న సెడా ఇసిల్దార్ అనే బాధితురాలి మాటల్లో.. అతడు మైనర్ బాలికలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుంటాడని, ఆ తర్వాత అక్కడి విషపూరిత వాతావరణాన్ని పరిచయం చేస్తాడని చెప్పింది. తనను కూడా లైంగికంగా వేధించాడని, పెళ్లికి బలవంతం చేశారని వాపోయింది. అంతేకాదు ముక్కు సరిగ్గా లేదని.. మత్తుమందు ఇవ్వకుండానే సుత్తి, ఉలితో ముఖాన్ని చెక్కేశారని ఆవేదన వ్యక్తం చేసింది. క్రూరమైన సర్జరీ వల్ల తాను ఇంకా మానసిక క్షోభకు గురవుతున్నానని బాధితురాలు తెలిపింది. ‘‘నాకు సుత్తి దెబ్బలు ఇంకా గుర్తున్నాయి.. నా ముక్కును సుత్తి, ఉలితో ఎన్నిసార్లు కొట్టారో నేను లెక్కించాను’’ అని ఆమె కన్నీటిపర్యంతమయ్యింది. ఓక్టార్ బారి నుంచి తప్పించుకున్న మరో మహిళ సెలాన్ ఓజ్గుల్ మాట్లాడుతూ.. తనకు 24 ఏళ్లప్పుడు 2006లో ఓక్టార్ కల్ట్‌లో చేరాను...గ్రూపులోని అత్యంత ప్రముఖ సభ్యుల్లో ఒకరిగా మారాను.. లైంగిక ఆరోపణలు వ్యవహారం వెలుగులోకి వచ్చేంత వరకూ ఉన్నాను’’ అని తెలిపింది. ఇక, మహిళలను పిల్లికూనలు, పురుషులను సింహాలతో పోల్చేవాడని బాధితులు తెలిపారు. లైంగిక ఆరోపణలు రావడంతో 2018లో ఓక్టార్, అతడి అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/XA6fZNm

No comments:

Post a Comment