Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 17 February 2022

ఒమిక్రాన్ తగ్గినా వేగంగా వ్యాప్తి చెందుతున్న సబ్-వేరియంట్.. WHO హెచ్చరిక

థర్డ్ వేవ్‌కి కారణమైన వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. దీంతో కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను పలు దేశాలు సడలిస్తున్నాయి. కానీ, ఒమిక్రాన్ సబ్-వేరియంట్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ అభివృద్ధి చెందుతోందని, ఒమిక్రాన్ అనేక సబ్-వేరియంట్లను గుర్తించామని కోవిడ్ టెక్నికల్ విభాగం చీఫ్ మారియా వెన్ కెర్ఖోవ్ హెచ్చరించారు. కరోనా పరిస్థితుల గురించి గురువారం ఆమె మాట్లాడిన ఓ వీడియోను డబ్ల్యూహెచ్ఓ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ‘‘వైరస్ అభివృద్ధి చెందుతోంది.. ఒమిక్రాన్ అనేక సబ్-వేరియంట్‌లను గుర్తించాం.. BA.1, BA.1.1, BA.2, BA.3గా రూపాంతరం చెందింది. నిజంగా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా డెల్టాను ఎలా అధిగమించిందనేది నమ్మశక్యం కావడం లేదు.. చాలా వరకు జన్యు విశ్లేషణల్లో BA.1, BA.2 సీక్వెన్స్‌ల నిష్పత్తిలో పెరుగుదలను కూడా చూస్తున్నాం ’’ అని అని ఆమె అన్నారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా 75,000 కరోనా మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. సబ్-వేరియంట్ BA.2పై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ.. ఇతర వాటి కంటే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. అయితే, BA.1 కంటే BA.2 అత్యంత ప్రమాదకారని చెప్పడానికి ఇప్పటి వరకూ ఎటువంటి ఆధారాల్లేవు కానీ, నిశితంగా గమనిస్తున్నామని అన్నారు. ఒమిక్రాన్ స్వల్పమైంది కాదు కానీ, డెల్టా కంటే తీవ్రత తక్కువేనని డబ్ల్యూహెచ్ఓ అధికారులు చివరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘ఒమిక్రాన్ బారినపడి ఆస్పత్రుల్లో చేరినవారి సంఖ్య పెరగడం ఇప్పటికీ చూస్తున్నాం.. మరణాలు కూడా పెరుగుతున్నాయి.. ఇది సాధారణ జలుబు, ఇన్‌ఫ్లూయోంజా కాదు.. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండాలి’’ అని కెర్ఖోవ్ హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచంలో నిర్ధారణ అవుతున్న ప్రతి ఐదు కొత్త ఒమిక్రాన్ కేసుల్లో ఒకటి బీఏ.2 కేసు అని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఇక, రెండు రోజుల కిందట వీక్లీ కోవిడ్ అప్‌డేట్స్‌లో తూర్పు ఐరోపాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలిపింది. అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్‌లో గత రెండు వారాల నుంచి కేసులు పెరుగుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ ఐరోపా విభాగం డైరెక్టర్ హన్స్ క్లూగే అన్నారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/0CIucoK

No comments:

Post a Comment