ఇక నుంచి డిజిటల్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్‌

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రిడిటేషన్ మార్గదర్శకాలు-2022ను విడుదల చేసింది. ఈ మేరకు ఒక జర్నలిస్టు దేశ భద్రత, సార్వభౌమత్వం, సమగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే అక్రిడిటేషన్ రద్దు చేయబడుతుంది. పైగా దానిని తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. కొత్త నిబంధనల ప్రకారం జర్నలిస్టుపై తీవ్రమైన నేరం మోపబడితే అక్రిడిటేషన్ సస్పెండ్ చేయవచ్చు. అలాగే ఇక నుంచి డిజిటల్ న్యూస్ జర్నలిస్టులకు గుర్తింపు లభించనుంది. ఇకపై వారు అక్రిడిటేషన్ పొందవచ్చు. మొదటిసారిగా డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులను అక్రిడిటేషన్‌కు అర్హులుగా ప్రకటించింది. వెబ్‌సైట్ కనీసం ఒక సంవత్సరం పాటు నిరంతరంగా పనిచేసి ఉండాలి. వెబ్‌సైట్‌కి దేశంలో రిజిస్టర్డ్ కార్యాలయం ఉండాలి. కరస్పాండెంట్‌లు ఢిల్లీ లేదా జాతీయ రాజధాని ప్రాంతంలో ఉండాలి. విదేశీ వార్తా మీడియా సంస్థల కోసం పనిచేస్తున్న ఫ్రీలాన్స్ జర్నలిస్టులకు ఎలాంటి అక్రిడిటేషన్ మంజూరు చేయబడదు. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు కల్పించే మార్గదర్శకాలు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలను అనుసరించి 2021లోని రూల్ 18 ప్రకారం సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు అవసరమైన సమాచారాన్ని అందించాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించకూడదు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/Cncpe1B

Post a Comment

0 Comments