
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులు, విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. బుధవారం 240 మందితో కూడిన తొలి విమానం ఢిల్లీకి చేరుకుంది. గురువారం ఉదయం మరో విమానంలో భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. అయితే, ఢిల్లీ నుంచి ఉక్రెయిన్‌కు గురువారం ఉదయం బయలుదేరిన ఎయిరిండియా విమానాన్ని అత్యవసరంగా వెనక్కు రప్పించారు. రష్యా సైనిక ఆపరేషన్ మొదలుపెట్టడంతో తన గగనతలాన్ని మూసివేసింది. ఈ నేపథ్యంలో విమానం అక్కడకు వెళ్లడం సురక్షితం కాదని హెచ్చరించడంతో విమానాన్ని వెనక్కు మళ్లించారు. తూర్పు ఉక్రెయిన్‌లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలు మొదలు కావడంతో గగనతలం అస్తవ్యస్తంగా ఉంటుంది. యుద్ధ విమాన వ్యతిరేక కార్యకలాపాలతో రద్దీగా ఉండే గగనతలం అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇది వాణిజ్య విమానాలకు ఎక్కువ ప్రమాదం. ఉక్రెయిన్ సాయుధ దళాలు, రష్యా అనుకూల వేర్పాటువాదుల మధ్య జరిగిన భారీ పోరులో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని జులై 2014లో కూల్చివేశారు. అందులో ఉన్న మొత్తం 298 మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా తయారు చేసిన బీయూకే యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి తూర్పు ఉక్రెయిన్ నుంచి ప్రయోగించిడంతో విమానం కూలిపోయినట్టు పరిశోధకులు ఇప్పటికీ అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేలమంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే అక్కడ ఏర్పడిన యుద్ధ వాతావరణం కారణంగా భారతీయుల భద్రత కోసం ప్రభుత్వం అప్రమత్తమై వారిని దేశానికి వచ్చేయమని సూచించింది. ఈ మేరకు వారిని ఇక్కడకు రప్పించేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసింది. ఫిబ్రవరి 24,25,26, మార్చి 6న అక్కడ నుంచి ప్రత్యేక విమానాలు నడుపుతున్నట్టు ప్రకటించింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/td4HgU7
No comments:
Post a Comment