Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 23 February 2022

Ukraine Crisis ఉక్రెయిన్ రాజధానిలోకి రష్యా సైన్యం.. 10 నిమిషాలకు ఒక సిటీ స్వాధీనం!

సైనిక ఆపరేషన్‌కు పుతిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే ఉక్రెయిన్‌లోని పలు చోట్ల దాడులు మొదలయ్యాయి. డొనెట్స్క్‌ ప్రాంతంలో ఉన్న క్రమాటోర్క్స్‌లో పేలుళ్లు వినిపించాయి. మరోవైపు, ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కూడా ఐదు భారీ పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో కీవ్‌ విమానాశ్రయం తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లిపోయింది. మొత్తంగా కీవ్‌, ఖర్కీవ్‌, ఒడిసా, తూర్పు డొనెట్స్క్‌ ప్రాంతంలో పేలుళ్లు జరిగినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. తూర్పున ఉన్న సముద్ర తీర నగరం మారియాపోల్‌నూ శక్తిమంతమైన పేలుళ్లు జరిగాయి. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద నగరాలైన ఒడేసా, ఖార్కీవ్లలోనూ పేలుడు శబ్దాలు వినిపించాయి. యుద్ధ ప్రకటన నేపథ్యంలో రష్యా దళాలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. ఎయిర్‌బేస్, మిలటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్‌లోని అతిపెద్ద పోర్టు సిటీపై కూడా రష్యా సైన్యం దాడిచేసింది. కీవ్ ఎయిర్‌పోర్టును రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. వైపు నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కావడం లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం తరహాలో రష్యా విరుచుకుపడుతోంది. ప్రతి 10 నిమిషాలకు ఒక్కో నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుందంటే రష్యా దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు, ఉక్రెయిన్ పార్లమెంట్ సహా ప్రభుత్వ ఏజెన్సీలు, బ్యాంకింగ్ వెబ్సైట్లు సైబర్ దాడులకు గురికావడంతో సేవలు స్తంభించిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వెల్లడించారు. విధ్వంసకర మాల్వేర్ను వందలాది కంప్యూటర్లలోకి చొప్పించారని తెలిపారు. లాత్వియా, లిథువేనియా దేశాల్లోని కంప్యూటర్లలోనూ వైరస్ దాడులు జరిగాయని చెప్పారు. ఓవైపు సైనిక చర్యకు పాల్పడుతున్న రష్యానే.. సైబర్ దాడులు చేసిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. మేం బలంగా ఉన్నామని, ఎటువంటి పరిణామాలకైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ యుద్ధంలో మేము విజయం సాధిస్తామని అన్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని జనావాసాలపై రష్యా సైన్యం మిసైల్స్‌తో విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 300 మంది వరకూ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలొస్తున్నాయి. వ్లాదిమిర్ పుతిన్ తమ దేశంపై పూర్తిస్థాయి దండయాత్రను ప్రారంభించారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా ఆరోపించారు. ‘‘పుతిన్ ఇప్పుడే ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించింది.. శాంతియుత ఉక్రేనియన్ నగరాలు దాడులతో దద్దరిల్లుతున్నాయి’’ కులేబా ట్వీట్ చేశారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/uACnwjp

No comments:

Post a Comment