Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 21 February 2022

UNSC రష్యా చర్యలతో ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితి.. అమెరికా ఘాటు వ్యాఖ్యలు

- ఉక్రెయిన్‌ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. ఈ భేటీలో అగ్రరాజ్యం సహా పలు దేశాలు రష్యా తీరుపై మండిపడ్డాయి. తూర్పు ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ పేరిట రష్యా చేపట్టిన చర్యలు ‘అర్థం లేనివి’ అని అమెరికా ధ్వజమెత్తింది. యుద్ధం చేయాలన్న దురుద్దేశంతోనే ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలకు స్వతంత్ర హోదా కల్పించిందని మండిపడింది. రష్యా చర్యల వల్ల ప్రపంచవ్యాప్తంగా భయానక పరిస్థితులు నెలకుంటాయని తూర్పారబట్టింది. ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి లిండా థామస్‌ గ్రీన్‌ఫీల్డ్‌ మాట్లాడుతూ.. ‘‘రష్యా చర్యల వల్ల ఉక్రెయిన్‌తో పాటు ఐరోపా, ప్రపంచమంతటా భయానక పరిణామాలు చోటుచేసుకుంటాయి.. ఉక్రెయిన్‌ సైన్యం, అక్కడి వేర్పాటువాదుల మధ్య ఘర్షణలను నివారించేలా 2014-15లో చేసుకున్న మింస్క్‌-2 ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ ముక్కలు చేశారు.. ఆయన అంతటితో ఆగుతారనే నమ్మకం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్‌, లుహాన్స్క్‌కు స్వతంత్ర హోదా ఇస్తున్నట్టు ప్రకటించిన రష్యా.. తూర్పు ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు డాన్‌బాస్‌ ప్రాంతంలోకి భారీగా శాంతి పరిరక్షక బలగాలను పంపేందుకు ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆందోళనకు గురైన .. ఈ పరిణామాలపై అత్యవసర సమావేశం నిర్వహించాలని ఐరాసను కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ మాట్లాడుతూ.. ‘‘తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రాంతాలకు స్వతంత్ర హోదా గుర్తింపుతో రష్యా.. అంతర్జాతీయ ప్రాదేశిక సమగ్రత, ఉక్రెయిన్‌ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. ఈ సందర్భంగా ఐరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా స్పందిస్తూ.. ‘దౌత్యపరమైన పరిష్కారం కోసం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం.. అయినప్పటికీ, డాన్‌బాస్‌లో కొత్తగా రక్తపాతానికి అనుమతించాలని కోరుకోవడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ఇటీవల వారాల్లో ఉక్రెయిన్ పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి మూడు సార్లు సమావేశమయ్యింది. అయితే, క్రిమియాను రష్యా ఆక్రమించుకున్న 2014 నుంచి పదుల సంఖ్యలో భద్రతా మండలి సమావేశాలు నిర్వహించింది. అయినా సరే రష్యాకు వీటో అధికారం ఉండటంతో ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది. అటు రష్యా చర్యలను బ్రిటన్‌ సహా పలు దేశాలు ఖండించాయి. పుతిన్‌ చర్యలను తప్పుబట్టిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. ఉక్రెయిన్‌కు అవసరమైన మేర తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. జర్మనీ ఛాన్సలర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు కూడా పుతిన్‌ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాపై కఠిన ఆంక్షలు విధిస్తామని ఐరోపా సమాఖ్య తేల్చి చెప్పింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/Qpk17K8

No comments:

Post a Comment