స్మార్ట్‌ఫోన్ల పుణ్యమాని కళ్లకు ఏది కనబడితే దాంతో సెల్ఫీలు తీసుకునే అలవాటు అయిపోయింది. చివరకు శవాలతో కూడా సెల్ఫీలు తీసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయితే కొన్నిసార్లు ఈ సెల్ఫీలే మనల్ని చిక్కుల్లో పడేస్తుంటాయి. పాములో సరదాగా సెల్ఫీ తీసుకున్న ఓ యువకుడు పోలీసులకు చిక్కి కటకటాలు లెక్కిస్తున్నాడు. ఒడిశాలోని బరగఢ్‌కు చెందిన రోహిత్ మేహర్ పాములు పట్టుకోవడంలో దిట్ట. ఇటీవల అతడి ఇంటికి సమీపంలో ఓ నాగుపాము రాగా దాన్ని పట్టుకుని రోహిత్ ఆటలాడాడు. సెల్ఫీలు కూడా తీసుకున్నాడు. ఈ ఫోటోలను ఇటీవల అతడు సోషల్‌మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారాయి. రోహిత్ ఫోటోలు పరిశీలించిన జంతు ప్రేమికులు ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అధికారులు శుక్రవారం రోహిత్‌ను అరెస్ట్ చేశారు. వన్య ప్రాణులకు హాని కలిగించే చర్యలు పాల్పడితే కఠినచర్యలు తప్పవని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2JHjl7p
No comments:
Post a Comment