Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 19 July 2019

‘ఒక ఛాన్స్‌, రాజన్న రాజ్యం అన్నారు.. వారికి 60 రోజుల్లోనే ఐదేళ్ల కోరిక తీరింది’

గోదావరి వరద జలాల మళ్లింపుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గోదావరి నీటిని కృష్ణాకు తరలించడానికి అధ్యయనం చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశంపై ఏపీలో ప్రతిపక్ష తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ అంశపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి నీటిని పక్క రాష్ట్రానికి మళ్లిస్తే రైతులు చూస్తూ ఊరుకోరని దేవినేని హెచ్చరించారు. వైసీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన ప్రకాశం జిల్లా టీడీపీ కార్యకర్తలను శుక్రవారం పరామర్శించిన ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయంగా, ఆర్థికంగా, పోలీసులపరంగా సహాయం అందించిన రాష్ట్రానికి ‘నీకిది- నాకిది’ కింద గోదావరి నీటిని తాకట్టు పెట్టేందుకు సీఎం జగన్‌ చూస్తున్నారని మాజీ మంత్రి విమర్శించారు. కృష్ణా బ్యారేజీ నుంచి వైకుంఠపురం వద్ద ఎత్తిపోతల ద్వారా సోమశిల, వెలుగొండ ప్రాజెక్టులకు నీటిని తరలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకూ గోదావరి జలాలను పంపేందుకు వీలుందని దేవినేని అన్నారు. పోలవరం నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. తన పాదయాత్ర సమయంలో పోలవరం ప్రాజెక్టులో రూ.25వేల కోట్ల దోపిడీ జరిగిందన్న జగన్, ఇప్పుడేమో రూ.1,331 కోట్ల అంచనా ఎక్కువ వేశారని మాట్లాడుతున్నారన్నారు. ఇలాంటి తప్పుడు మాటలతోనే ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని ధ్వజమెత్తారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై దాడులకు పాల్పడటం, వారి ప్రాంతాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడం, సీసీ రోడ్లను ధ్వంసం చేయడం హోయమైన చర్య అని మండిపడ్డారు. స్థానిక సంస్థలను ఎదుర్కొనేలా ముందుకు సాగుతామని దేవినేని తెలిపారు. ఒక ఛాన్స్‌ అన్నారు... రాజన్న రాజ్యం అన్నారు. వారికి 60 రోజుల్లోనే 60 నెలల కోరిక తీరిందని జగన్‌ పాలనుద్దేశించి మాజీ మంత్రి ఎద్దేవా చేశారు. మేము 151 మంది సభ్యులం లేస్తే, 23 మంది కూర్చోలేరని అనడం చూస్తే రాజ్యం ఎలా ఉందో అర్థమవుతుందని ఆయన దుయ్యబట్టారు. ఉద్యోగుల బదిలీల్లోనూ అవినీతి జరిగిందని, కానిస్టేబుళ్లు, పీఏలు లేఖలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మరో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ఆరోపించారు అంతా ప్రజలు గమనిస్తన్నారని, నియంత పాలన సాగుతోందని, అందుకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆయన విమర్శించారు. తమ పార్టీకి ఓటు వేయలేదని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లకు విద్యుత్తు ఆపారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేయాలని దామచర్ల కోరారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2O6Hfgz

No comments:

Post a Comment