Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 21 July 2019

దివంగత సీఎంకి గుడికట్టి ప్రత్యేక పూజలు చేస్తున్న అభిమానులు!

దివంగత ముఖ్యమంత్రి, అధినేత్రి తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఎంతలా అంటే తమిళులు ఆమెను ‘అమ్మ’అంటూ ప్రేమగా పిలుచుకునే స్థాయికి ఎదిగారు. భౌతికంగా ఆమె దూరమైనా ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. తాజాగా కోయంబత్తూరులో ఆమె అభిమానులు జయలలితకు గుడికట్టి, అందులో ఆమె విగ్రహాన్ని నెలకొల్పారు. జ్ఞానేశ్వపురంలో అన్నాడీఎంకే కార్యకర్తలు, గ్రామస్థులు ఆలయం నిర్మించి పూజిస్తున్నారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం సమీపంలో జయలలిత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 8 టన్నుల బరువున్న శిలపై జయ శిల్పాన్ని చెక్కడం విశేషం. జయలలితకు ఒకవైపు ఈటె, మరోవైపు గంట, పైన పార్టీ గుర్తు రెండు ఆకులు ఉన్నాయి. దీనికి రెండు వైపులా కాలభైరవుడు, ఆంజనేయ స్వామి చిత్రాలతో పాటు 12 రాశుల చిత్రాలనూ చెక్కారు. అమ్మ అభిమానులు రోజూ ఆలయానికి వచ్చి జ్యోతి వెలిగించి, పూలతో పూజిస్తారు. కోయంబత్తూరు నగర కార్పొరేషన్ యోగా కేంద్రం ఎదుట జయలలిత ఆలయం ఉంది. ఇక్కడకి సమీపంలోని ఉండే ప్రముఖ ఆలయం అమ్మన్ గుడికి జయలలిత బతికున్నప్పుడు తరుచూ వచ్చేవారు. జులై 13న గుడిలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దాదాపు ఏడాదిపాటు శ్రమించి విగ్రహాన్ని రూపొందించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన జయలలిత 75 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ డిసెంబరు 5,2016న కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎంజీఆర్‌కు సైతం అన్నాడీఎంకే అభిమానులు గుడి కట్టారు. తిరువళ్లూరు జిల్లా నథ్‌మేడులో 2011లో గుడి నిర్మించి పూజిస్తున్నారు. ఎంజీఆర్ మరణం తర్వాత 1980లో ఆయనకు చెన్నైలో ఆలయం నిర్మించగా, మద్రాసు హైకోర్టు ఆదేశాలతో తొలగించారు. అయితే, తమ అభిమాన నేతలు, సినీతారలకు తమిళులు గుడి కట్టి ఆరాధించడం కొత్తేం కాదు. గతంలో నటి కుష్భూకి తిరుచిరాపల్లిలో కూడా గుడికట్టారు. అయితే, పెళ్లికి ముందు సెక్స్‌లో పాల్గొనడాన్ని తాను సమర్దిస్తానని చేసిన వ్యాఖ్యలతో భగ్గుమన్న అభిమానులు దానిని కూల్చేశారు. బొద్దుగుమ్మ నమితకు సైతం తిరునాల్వేలి జిల్లాలో ఓ అభిమాని గుడికట్టి, అందులో ఆమె విగ్రహం ఏర్పాటుచేశాడు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2M2hUSh

No comments:

Post a Comment