జీడిమెట్లలో దారుణం.. ఆకతాయిల్ని మందలించిన వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆకతాయులు యువతిని వెధిస్తున్నారని వారిని మందలించడానికి వెళ్ళిన ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిందితులు పారిపోగా, గాయపడ్డ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పోందుతూ మృతి చెందాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని విమాన పురి కాలనీలో నివాసముంటున్న పావని(24) నర్స్ ఉద్యోగం చేస్తుంది. డ్యూటీ ముగించు కొని తన సోదరుడితో కలసి బైక్ పై ఇంటికి వస్తోంది. Read More: అయితే ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్‌పై వాహనం పై స్పీడ్ గా వస్తూ ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆ యువతి ఇంట్లోకి వెళ్లిపోయింది. కాని యువతి సోదరుడు తనకు పరిచయమున్న సురేష్ గౌడ్ అనే వ్యక్తికి ఈ విషయాన్ని చెప్పాడు.. దీంతో అదే కాలనీలో ఉన్న యువకుల ఇంటి దగ్గరకు వెళ్లి అడిగాడు. దీంతో ఆ యువకుల తండ్రి చాకు తీసుకొని ఆవేశంతో సురేష్ పై దాడి చేసాడు. వెంటనే అక్కడున్న స్థానికులు తీవ్రంగా గాయపడిన సురేష్ ను స్ధానికంగా ఉన్న హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ గౌడ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/33bc9Ki

Post a Comment

0 Comments