Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

రైలుకు అడ్డంగా పడుకున్న యువకుడు.. ఎలా కాపాడారో చూడండి

రైలు రాక కోసం ప్రయాణికులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఊహించినట్టే ప్లాట్‌ఫాంపై మీదకు రైలు వస్తోంది. ఇంతలో ఓ యువకుడు పట్టాల మీదకు పరుగెత్తాడు. పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. అతడి ఉద్దేశమేంటో అర్థమవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వెంటనే పట్టాల పైకి పరుగెత్తుకెళ్లి ఆ యువకుడిని పక్కకు ఈడ్చేశారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేష‌న్‌లో ఫిబ్రవరి 24న ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లి మరణంతో మనస్తాపానికి గురై.. బాధితుడిని ఒడిశాకు చెందిన కిశోర్ నాయక్‌ (32)గా గుర్తించారు. తల్లి మరణం ఆ యువకుడిని తీవ్రంగా కలచివేసిందట. అమ్మ లేని లోకంలో నేనుందుకు ఉండటం అనుకున్నాడు. అలా ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టాల మీద ఓ సంచి ప‌రుచుకొని రైలుకు అడ్డంగా ప‌డుకున్నాడు. రైలు అత‌డిని స‌మీపించే లోపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్.. అతడిని పక్కకు లాగేశారు. దీంతో ప్రమాదం తప్పింది. కిశోర్ నాయక్‌ను లాగేసిన కొద్ది క్షణాల్లోనే రైలు ఆ ట్రాక్ పైనుంచి ముందుకు వెళ్లింది. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఉత్కంఠకు గురిచేసింది. ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రవీంద్ర, ఆశిష్‌ను అధికారులు ప్రశంసించారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఆ దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2NyF46h

No comments:

Post a Comment