Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 26 February 2021

కోర్టు ఆదేశాలతోనే టైగర్ అవ్నీని చంపారు.. దీనిపై చర్యలు తీసుకోలేం: కేసు కొట్టేసిన సుప్రీం

మనుషుల రక్తం మరిగిన ఓ పులిని ఆదేశాలతో 2018లో మహారాష్ట్ర అటవీ అధికారులు వేటగాడి సాయంతో మట్టుబెట్టారు. మహారాష్ట్రలోని యావత్‌మాల్ జిల్లా పంధార్ కవడ గ్రామానికి చెందిన 14 మంది గొర్రెల కాపరులను అవ్నీ అనే ఆడ పులి చంపేసింది. ఈ మ్యాన్‌ఈటర్ పులిని హైదరాబాద్ వేటగాడు, వైల్డ్ లైఫ్ ట్రాన్క్విల్ ఫోర్స్ అధినేత నవాబ్ షఫత్ అలీఖాన్‌ అంతం చేశాడు. దీనిపై జంతు సంరక్షణ హక్కుల కార్యకర్త సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ధిక్కారణ పిటిషన్‌ను తాజాగా బుధవారం ఉపసంహరించుకున్నారు. నిబంధనలకు అతిక్రమించి అవ్నీ లేదా టీ1 అనే పులిని హత్యచేశారని సంగీత డోగ్రా కోర్టు ధిక్కారణ పిటిషన్ దాఖలు చేశారు. అవ్నీని చంపిన తర్వాత వేటగాడికి అటవీ శాఖ అధికారులు సన్మాన కార్యక్రమం ఏర్పాటుచేసి.. వెండి పులిని బహుకరించారని ఆరోపించారు. పంధార్ కవడ గ్రామస్థుల చేతుల మీదుగా దీనిని అధికారులే ఇప్పించారని డోగ్రా ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణలు మహారాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. కోర్టు ఉత్తర్వులతోనే పులిని చంపారని, ఫారెస్ట్ అధికారులు ఎవరూ వేటగాడికి జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొనలేదని శుక్రవారం కోర్టు తెలిపింది. ‘అటవీ శాఖ అధికారులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ వేడుకల్లో పాల్గొనలేదు.. ఈ విషయాన్ని నివేదిక కూడా ధ్రువీకరించింది.. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పాటించాం’ అని వివరించింది. ‘పులి నుంచి తమకు ఉపశమనం లభించినందుకు గ్రామస్థులు సంబరాలు చేసుకుంటే దీనికి అటవీ శాఖ అధికారులు ఎలా బాధ్యులు అవుతారు’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే పిటిషనర్‌ను ప్రశ్నించారు. దీనికి డోగ్రా స్పందిస్తూ.. ‘పులిని చంపిన వ్యక్తి సంబరాల్లో పాల్గొన్నారు.. ఈ ఘటనపై కమిటీ నివేదిక సమర్పించలేదు.. విచారణ కొనసాగుతోంది.. వాళ్లు ఎందుకు వేడుకలు చేసుకున్నారు.. దీనిపై అధికారులు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు’ అని పేర్కొన్నారు. అంతకు ముందు విచారణంలో అవ్నీ అసలు మనుషులను చంపితినట్టు పోస్ట్‌మార్టమ్, డీఎన్ఏ పరీక్షల్లో ఆధారాలు దొరకలేదని వాదించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ఓ జంతువు మనిషిని చంపి తింటే పోస్ట్‌మార్టమ్ నివేదికలో ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. మనిషి చంపి తిన్న తర్వాత పులి పొట్టలో ఆరు మాసాల పాటు గోళ్లు, జుట్టు ఆనవాళ్లు ఉంటాయి.. కానీ, ఈ పులి కడుపు ఖాళీగా ఉందని డోగ్రా అన్నారు. అయితే, వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. తమ తీర్పును సమీక్షించబోమని స్పష్టం చేసింది. ఇది చాలా సీరియస్ అంశం.. ఇందులో మేము జోక్యం చేసుకోలేం.. దీనిని ఉపసంహరించుకోవాలని అని సీజేఐ సూచించారు. దీంతో తన పిటిషన్‌ను వెనక్కు తీసుకుంటున్నట్టు సంగీత డోగ్రా తెలియజేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3kuml7F

No comments:

Post a Comment