భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చూస్తుండగానే మంటలు చుట్టుముట్టాయి. ఆ భవనంలోని మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో తల్లి, నలుగురు చిన్నారులు ఉన్నారు. వారి ఇంటి ద్వారం ముందు అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. తప్పించుకునే మార్గమే లేదు. దిక్కుతోచని స్థితిలో ఆ తల్లి ఊహించని నిర్ణయం తీసుకుంది. కాళ్లు, చేతులు విరిగినా.. పర్వాలేదు గానీ, తన పిల్లలు అగ్నికి ఆహుతి కాకూడదనుకుందేమో.. వారిని కిటికీలో నుంచి కిందకు విసిరేసింది. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉన్న మహిళ తన నలుగురు పిల్లలను కిటికీ నుంచి కిందకు విసిరేసిన దృశ్యాలను అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అయితే.. ఆ భవనం కింద ఉన్న కొంత మంది వాలంటీర్లు బ్లాంకెట్లతో ఆ పిల్లల్ని పట్టుకున్నారు. పిల్లలు సురక్షిత స్థితిలో ఉండటంతో ఆ తల్లి మనసు శాంతించింది. ఈలోగా మంటలు, దట్టమైన పొగ వారి ఫ్లాట్‌ను కమ్మేశాయి. ఈ తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి భవనంలో మంటలను ఆర్పేశారు. భవనంలో చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఈ తల్లి, పిల్లలందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. Don't Miss: ✦ ✦ ✦
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3qUOzuN
No comments:
Post a Comment