కాటమరయుడికి ఎంత కష్టం వచ్చింది
పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంటే పాత సినిమాలన్నింటినీ తీసేసి..
అతడి సినిమాను రీప్లేస్ చేసేయడం చూస్తుంటాం. ‘కాటమరాయుడు’ విషయంలోనూ అలాగే జరిగింది. అప్పటిదాకా
థియేటర్లలో ఉన్న సినిమాలన్నీ ఒక్క దెబ్బకు లేచిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని
థియేటర్లలో 90 శాతానికి పైగా ‘కాటమరాయుడు’తో నిండిపోయాయి
పోయిన శుక్రవారం. కానీ ‘కాటమరాయుడు’ది ఆరంభ శూరత్వమే
అయింది. రెండో రోజుకే ఇందులో కొన్ని థియేటర్లు వేరే సినిమాలతో రీప్లేస్ అవగా..
సోమవారం కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోవడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా తయారైంది.
ఇప్పుడు ‘కాటమరాయుడు’ ఆడుతున్న
రెగ్యులర్ థియేటర్లు కూడా వేరే సినిమాల వైపు చూస్తున్నాయి.
ఎప్పుడో సంక్రాంతికి రిలీజైన మెగాస్టార్ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’.. శర్వానంద్ చిత్రం
‘శతమానం భవతి’.. ఫిబ్రవరిలో
వచ్చిన నాని మూవీ ‘నేను లోకల్’ సినిమాల్ని ‘కాటమరాయుడు’ బదులు
ఆడించడానికి సిద్ధపడ్డారు ఎగ్జిబిటర్లు. చాలాచోట్ల పవన్ సినిమాను తీసేయడం.. వీటిని
వేసేయడం జరిగిపోయింది. దీన్ని బట్టి ‘కాటమరాయుడు’ ఏ మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాడో
అర్థం చేసుకోవచ్చు. తొలి రోజు నుంచే సినిమాకు డివైడ్ టాక్ ఉండటంతో కలెక్షన్లపై
బాగా ప్రభావం చూపింది. అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా జరగడం వల్ల వీకెండ్ వరకు ఢోకా
లేకపోయింది కానీ.. ఆ తర్వాత సినిమా అసలు సత్తా ఏంటో బయటపడింది. ఈ శుక్రవారం కొత్త
సినిమాలు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో ‘కామటరాయుడు’ కష్టాలు మరింత పెరగనున్నాయి.
No comments:
Post a Comment