Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 31 March 2017

బాహుబలిని కొనాలంటే బయపడుతున్నారు

బాహుబలిని కొనాలంటే బయపడుతున్నారు

అదేంటీ.. బాహుబలి లాంటి హిట్ గ్యారెంటీ సినిమాను కొనేందుకు ఎందుకు భయపడాలి అని అనుకుంటున్నారా.. మీ డౌట్ కు ఆన్సర్ ఉంది. అసలు విషయం ఏంటంటే.. బాహుబలి ద కన్ క్లూజన్ సినిమా.. దేశ వ్యాప్తంగా భారీ రేట్లకు అమ్ముడవుతోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా చేసింది. నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ కూడా వచ్చేసిందన్న ప్రచారం ఉంది.
కానీ.. కర్ణాటకలో మాత్రం.. సీన్ రివర్స్ గా నడుస్తోంది. అక్కడ రెండు కారణాలు.. బాహుబలి అమ్మకానికి తెగ అడ్డం పడిపోతున్నాయట. ఒకటి.. నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడం అయితే.. రెండోది ఓ వర్గానికి చెందిన ఆందోళన. తమిళనాడుకు చెందిన సత్యారాజ్ ఈ సినిమాలో కట్టప్పగా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఆయనే.. ఈ వివాదానికి పరోక్షంగా కారణమవుతున్నారు.
గతంలో.. కావేరీ జల వివాదానికి సంబంధించి.. తమిళనాడుకు అనుకూలంగా సత్యరాజ్ మాట్లాడారన్న ఆగ్రహంతో.. కర్ణాటకలో కొందరు ఆందోళన చేస్తున్నారు. ఆయన నటించిన సినిమాను అడ్డుకుంటామని వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు.  ఈ గొడవ మధ్య సినిమాను కొంటే.. అడ్డంగా బుక్కయిపోతామన్న ఆందోళన.. కన్నడ బయ్యర్లను ఆలోచనలో పడేస్తోందట. అలాగే.. నిర్మాతలు చెబుతున్న భారీ మొత్తానికి సినిమాను కొనేంత ధైర్యం చేయలేకపోతున్నారట. ఇదీ సంగతి.




No comments:

Post a Comment