Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 July 2019

ఆయ్.. పులసలు వచ్చేశాయండి.. ధరేమో కొండెక్కిందండి!

‘పుస్తెలు అమ్ముకుని అయినా సరే పులస తినాలి’ అనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఆ చేపంటే వారికి ఎంతిష్టమో ఆ నానుడి వింటేనే తెలుస్తోంది. సంవత్సరానికి కేవలం రెండు నెలలు(జులై, ఆగస్టు) మాత్రమే లభించే అరుదైన పులస చేపంటే గోదావరి జిల్లా ప్రజలతో పాటు అనేక ప్రాంతాల ప్రజలు పడి చచ్చిపోతుంటారు. ‘చేపలందు రుచి వేరయా’ అంటూ లొట్టలేసుకుంటూ ఆరగించేస్తుంటారు. తాజాాగా అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటు పెరిగింది. దీంతో పులస చేపలు హాయ్ అంటూ గోదారోళ్లను పలకరిస్తున్నాయి. యానాం తీరంలో రెండు మూడు రోజులుగా పులస చేపలు వలలో పడుతున్నాయి. దీంతో మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని శివం పుష్కర ఘాట్ వద్ద ఆదివారం మత్స్యకారులు పులస చేపలు అమ్మకానికి పెట్టారు. చాలా తక్కువ సంఖ్యలో ఉన్నవాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. వాటి సైజును బట్టి రూ.1,400 నుంచి రూ.6వేలకు ధర పెట్టి కొనుక్కున్నారు. పులస చేపలు ఎక్కువగా భైరవపాలెం సమీపంలోని సముద్రం మొగవద్ద లభ్యమవుతాయి. దీంతో మత్స్యకారులు నాటు పడవలపై అక్కడికి చేరుకుని పులసల కోసం వేట సాగిస్తున్నారు. సోమవారం కిలో బరువున్న పులస చేపను ఓ వ్యక్తి రూ.6వేలకు కొనుగోలు చేశాడు. కేవలం వరద సీజన్లో మాత్రమే దొరికే పులస చేప ధర చాలా ఎక్కువగా ఉంటుందని, రాబోయే రోజుల్లో కిలో చేప ధర రూ.8వేలకు కూడా చేరుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఇదీ పులస చేప కథ.. పులస శాస్త్రీయ నామం హిల్సాహిల్సా. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సముద్ర జలాల్లో సంచరించే ఈ చేప సంతానోత్పత్తి సమయంలో గుడ్లు పెట్టడానికి ఉభయ గోదావరి జిల్లాల సముద్ర జలాల్లోకి వస్తుంది. ఆషాడ, శ్రావణ మాసాల్లో ఇక్కడ గుడ్లు పెట్టి మళ్లీ సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఇలసగా పిలిచే ఈ చేప గోదావరిలోకి ఎర్రనీరు రాగా ఎదురు వైపు ఈదుకుంటూ నదిలోకి వచ్చి రెండు మూడు రోజుల్లోనే పులసగా మారుతుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా సమీపంలోని యానం వద్ద పులసలు విరివిగా దొరుకుతాయి. ఈ చేపలు ఒడిశాతో పాటు బంగ్లాదేశ్ తీరాల్లో దొరికినా గోదావరి జలాల్లో దొరికిన పులసంత రుచి వాటికి ఉండదని మత్స్యకారులతో పాటు ఆహార ప్రియులు చెబుతుంటారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30Vqpmq

No comments:

Post a Comment