Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 July 2019

‘కొద్ది రోజులాగు చిట్టినాయుడూ.. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు’

మాంసం వ్యాపారి మొయిన్‌ఖురేషీ మనీల్యాండరింగ్ కేసులో హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సాన సతీశ్‌కుమార్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసుతోనే సీబీఐ ఉన్నతాధికారుల మధ్య లుకలుకలు బయటపడటమే కాదు, ఒకరిపై ఒకరు కేసులు నమోదుచేసుకునే వరకు వెళ్లి, ఆ సంస్థ ప్రతిష్ఠను బజారుకీడ్చింది. తాజాగా, సానా సతీశ్‌ను ఈడీ అరెస్ట్ చేయడంతో మరోసారి ఈ కేసు వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై నేత విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. సాన సతీశ్‌తో బాబు, ఇతర టీడీపీ నేతల సంబంధాలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పలు ఆరోపణలు చేస్తూ... చిన్న ఉద్యోగం చేసుకునే సాన సతీశ్, అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసిపెట్టే స్థాయికి ఎదగడం వెనుక చంద్రబాబు ఉన్నారని, ఈ విషయం అందరికీ తెలుసని ఆరోపించారు. అలాగే రాజధాని అమరావతిలో వేల ఎకరాలు లాగేసుకున్నారని లోకేశ్‌ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. అమాయక రైతుల పొట్టకొట్టి మీరు, మీ బినామీల లాగేసుకున్న వేలాది ఎకరాల స్టోరీలను సీరియల్‌గా బయటకు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ‘మనీలాండరింగ్‌ దళారి సానా సతీశ్‌తో చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాల పైనా కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు. ‘కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్‌సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్‌గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’ అంటూ ట్వీట్ చేశారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LLEyz1

No comments:

Post a Comment