
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలకు చైనా మద్దతుగా నిలిచింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో చర్చించాలని పాకిస్థాన్ రాసిన లేఖను సమర్థిస్తూ చైనా మరో లేఖ రాసింది. దీనిపై ఐరాసలో రహస్య సంప్రదింపులు జరపాలని కోరింది. భద్రతామండలిలో అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న పోలెండ్ రాయబారి జోన్నా రొనెక్కా దీనిపై స్పందిస్తూ శుక్రవారమే చర్చలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం 7.30 గంటలకు చర్చ ప్రారంభమయ్యే అవకాశముంది. 1971 తర్వాత ఐక్యరాజ్య సమితిలోని ఓ విభాగం కశ్మీర్ అంశంపై చర్చించడం ఇదే తొలిసారి. కశ్మీర్ అంశంపై నాలుగు దశాబ్దాల తర్వాత భద్రతా మండలిలో చర్చ జరగనుడటం పాక్ దౌత్య విజయమని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్యసమితికి పాక్ రాసిన లేఖ విషయాన్ని గురువారం ఆయన వెల్లడించారు. కశ్మీర్ అంశంపై అంతర్జాతీయంగా ఎదురయ్యే ఒత్తిడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసిద్ధంగా ఉంది. పాక్ ఎలాంటి ఎత్తుగడలు, కుయుక్తులు పన్నుతుందో ముందే ఊహించిన భారత్ అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుటోంది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెరస్ కశ్మీర్ అంశంపై స్పందిస్తూ జమ్మూ-కశ్మీర్ హోదాపై ప్రభావం చూపే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా భారత్, పాకిస్థాన్ పూర్తి స్థాయి సంయమనం పాటించాలని కోరారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KHOVRq
No comments:
Post a Comment