Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 28 July 2019

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ జగన్ రాజకీయ ప్రస్థానంపై పుస్తకం

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’అంటూ తన పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందుకున్న ఈ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఎన్నికల్లో ఆయనకు అఖండ విజయాన్ని సాధించినపెట్టింది. సుదీర్ఘ పాదయాత్రలో జగన్ లక్షలాది మందిని కలిసి, ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం, పాదయాత్ర విశేషాలు, ఎన్నికల హామీలు తదితర అంశాలను సీనియర్ జర్నలిస్ట్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుస్తకంగా తీసుకొచ్చారు.‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ పేరుతో రాసిన పుస్తకాన్ని విజయవాడలో ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. రచయిత శేఖర్‌బాబుపై ప్రశంసలు కురిపించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అభిరుచి తెలిసిన వ్యక్తి అని, సీఎం జగన్‌ పాదయాత్ర, ప్రజలకు ఇచ్చిన హామీలు తదితర అంశాలను గుర్తుచేస్తూ పుస్తకాన్ని రచించారని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం 60 రోజుల్లోపే అమలు చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయడం చరిత్రాత్మకమని మంత్రి పేర్కొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీల్లో 90శాతం ఇప్పటికే అమలు చేశారని, మిగతా పది శాతాన్ని త్వరలోనే పూర్తి చేస్తారని ఆయన వివరించారు. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు అన్ని విధాలా వివక్షకు గురయ్యారని, తమ ప్రభుత్వం మాత్రం వారికి పెద్దపీట వేసిందని స్పష్టం చేశారు. దివంగత సీఎం వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘యాత్రా’ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని మంత్రి కోరారు. అనంతరం జర్నలిస్ట్ శేఖర్‌బాబు మాట్లాడుతూ.. తాను గతంలో ఈనాడు, సితారలో పని చేపి, తర్వాత బీసీ ఉద్యమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. గతంలో ‘ఏపీ పొలిటికల్‌ డైరెక్టర్‌’ పుస్తకం రాశానని, దీనిని నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆవిష్కరించారని తెలిపారు. తాజాగా, జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను పుస్తక రూపంలో తీసుకువచ్చినట్లు రచయిత వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు బుద్దా నాగేశ్వరరావు, యలమంచిలి రవి, బొప్పన భవకుమార్‌, కె.దుర్గారావు, రమేష్‌ బీసీ నాయకులు ఐలాపురం వెంకయ్య, ఎస్‌.కె.చాంద్‌, కాటంరాజు, లాకా వెంగళ్‌రావు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2yhQY9j

No comments:

Post a Comment