
పట్టణంలో ఆదివారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్ సమీపంలో రోడ్డు పక్కన అట్టపెట్టె అనుమానాస్పద స్థితిలో ఉండటాన్ని ఓ యువకుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వన్‌టౌన్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని అట్టపెట్టెను పరిశీలించగా మగశిశువు మృతదేహం కనిపించింది. మృతశిశువుకు ఇంజక్షన్ చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితమే జన్మించి ఉంటాడని తెలుస్తోంది. శిశువు చనిపోవడంతో ఇక్కడకు తెచ్చి పడేశారా? లేక హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం పరిసర ప్రాంతాల్లో మగశిశువు అదృశ్యమైన ఘటనలపై ఆరా తీస్తున్నారు. వివాహేతర సంబంధాల నేపథ్యంలో శిశును కని పడేసి ఉంటారన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం పట్టణ డీఎస్పీ పొన్నపాటి వీరాంజనేయరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శిశువు మృతదేహాన్ని విజయనగరం ప్రభుత్వాసుపత్రికి ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ కిరణ్ తెలిపారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yqjct8
No comments:
Post a Comment