Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 27 August 2019

Arun Jaitley funeral: జైట్లీ అంత్యక్రియల్లో సెల్‌ఫోన్లు చోరీ.. ఇద్దరు మంత్రులు బాధితులే!

అనారోగ్యంతో పోరాడుతూ తుదిశ్వాస విడిచిన కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ అంత్యక్రియలకు భారీ సంఖ్యంలో రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలివచ్చారు. గత ఆదివారం (ఆగస్టు 25న) ఢిల్లీలోని యమునా నది తీరంలో ఉన్న నిగమ్‌ బోధ్‌ ఘాట్‌లో అధికార లాంఛనాలతో జైట్లీ అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు కన్నీడి వీడ్కోలు పలికిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బాధగా తమ నేతకు తుది వీడ్కోలు పలుకుంతుంటే కొందరు తమ బుద్ధి చూపించారు. జైట్లీ సన్నిహితులు, బంధువులంతా అంత్యక్రియల పనులు నిర్వహిస్తుంటే చోరీకి పాల్పడ్డారు. కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో సహా 11 మంది సెల్ అయినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు బాబుల్‌ సుప్రియో, సోమ్‌ ప్రకాశ్‌, సుప్రియో కార్యదర్శి సహా మరికొందరి ఫోన్లు జైట్లీకి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో చోరీకి గురయ్యాయి. చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చోరీ ఘటనపై తిజరావాలా ఎస్కే ట్వీట్ చేశారు. ‘నిగమ్ బోధ్ ఘాట్‌లో మాజీ మంత్రి జైట్లీకి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో బాబుల్ సుప్రియో సహా 11 మంది సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయని’ఆరోపిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా, ఢిల్లీ పోలీసులకు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం తన ఫోన్ ఈ లోకేషన్‌లో ఉందని సైతం పేర్కొంటూ తిజరావాలా ట్వీట్లు చేయడం గమనార్హం. Also Read: కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో సైతం ఫోన్ల చోరీపై ఘాటుగా స్పందించారు. ‘నిగమ్‌బోధ్‌ ఘాట్‌లో జనాలు గుమిగూడి ఉన్న చోటుకి నేను కూడా వెళ్లాను. ఆ సమయంలోనే నా ఫోన్‌ చోరీ అయింది. ఓకే చోట దాదాపు ఆరుగురి ఫోన్లు చోరీ అయ్యాయి. మొత్తంగా చెప్పాలంటే 35 మంది ఫోన్లు చోరీకి గురై ఉండొచ్చునని’ బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. 10-15 నిమిషాలకొకరు తమ ఫోన్ పోయిందని అరిచారు. దీనిపై పోలీసులను తాను తప్పుపట్టడం లేదని, అయితే ఘాట్‌లో ఎక్కువ సీసీటీవీ కెమెరాలు అమర్చి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Zw0lkM

No comments:

Post a Comment