
జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. డోర్ దగ్గర నిలబడుతున్న ఇంటర్ విద్యార్థిని లోపలి నుంచి ఓ వ్యక్తి తోసేయడంతో అతడు రైలు కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడి రెండు కాళ్లు తెగిపడిపోయాయి. తాడిపత్రికి చెందిన నిరంజన్‌రెడ్డి అనే యువకుడు విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ రెండో ఏడాది చదువుతున్నాడు. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న నిరంజన్‌రెడ్డిని కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేయాలని కోరడంతో ఆదివారం విజయవాడలో ధర్మవరం వైపు వెళ్లే రైలెక్కాడు. నిద్రపోవడంతో తాడిపత్రిలో రైలు దిగలేకపోయాడు. ఆ తర్వాత వచ్చే జక్కలచెరువు స్టేషన్లో రైలు ఆగకపోయినా నెమ్మదిగా వెళ్తుందని ఎవరో చెప్పడంతో అక్కడ దిగేందుకు డోర్ దగ్గర నిలబడ్డాడు. అదే సమయంలో లోపలి నుంచి ఓ వ్యక్తి తోసేయడంతో నిరంజన్‌రెడ్డి రైలు చక్రాల కింద పడిపోయాడు. దీంతో అతడి రెండు కాళ్లు తెగిపోయాయి. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Zogxk4
No comments:
Post a Comment