
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి మంగళవారం రాత్రి హార్ట్ అటాక్ కారణంగా మరణించారు. గత ఐదేళ్ల కాలంలో విదేశాంగ మంత్రి అద్భుత పనీతీరు కనబర్చిన ఆమె ఇక లేరనే వార్త తెలియగానే.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా దేశ ప్రజలంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. గుండె పోటు రాగానే ఆమెను ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. ఐదుగురు సభ్యుల డాక్టర్ల బృందం ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. దీంతో ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లారు. సుష్మా స్వరాజ్ చనిపోవడానికి కొద్ది గంటల ముందు కూడా ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు పార్లమెంట్ మంగళవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. ఇది చూడటం కోసమే జీవితకాలం ఎదురు చూశానని ఆమె ట్వీట్ చేశారు. కానీ ఊహించని రీతిలో ఇదే ఆమె చేసిన చివరి ట్వీట్ అయ్యింది. మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఈ ట్వీట్ చేసిన ఆమె.. అనూహ్య రీతిలో కాసేపటికే తుదిశ్వాస విడవడటంతో బీజేపీ శ్రేణులతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు విషాదంలో కూరుకుపోయారు. ఓవైపు జమ్మూ కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో కలిపేశామని సగటు భారతీయుడు ఆనందిస్తోన్న తరుణంలో అందరికీ ఇష్టమైన నేత దూరం కావడం బాధించే విషయం.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2YQTyBK
No comments:
Post a Comment