
కశ్మీర్ అంశంలో భారత్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిన పాకిస్థాన్ బొక్కబోర్లా పడింది. 48 సంవత్సరాల తర్వాత ఐక్యరాజ్యసమితిలోని ఓ విభాగంలో కశ్మీర్ అంశంపై చర్చ చేపట్టేలా చేయడం తమ దౌత్య విజయమని గర్వంగా ప్రకటించుకున్న పాక్‌కు ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. చైనా మద్దతుతో పాక్ పన్నిన కుయుక్తులను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం 7.30గంటలకు రహస్య చర్చ ప్రారంభమైంది. 73 నిమిషాలసేపు జరిగిన ఈ చర్చలో పాక్‌కు చుక్కెదురైంది. భారత్‌కు రష్యా బాసటగా నిలవడంతో ఆ దేశం చేష్టలుడిగి చూడాల్సి వచ్చింది. ఈ చర్చలో పాకిస్థాన్‌ను బలపరుస్తూ చైనా చేసిన వాదనను రష్యా తోసిపుచ్చింది. భారత్-పాక్‌ల ద్వైపాక్షిక అంశమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా భారత్ ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని రష్యా స్వాగతించింది. భద్రతా మండలిలోని మిగతా దేశాలు కూడా కశ్మీర్‌పై పాకిస్థాన్ వాదనను ఖండించాయి.. రష్యాతో పాటు అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కూడా భారత్‌కు మద్దతుగా నిలిచాయి. దీంతో పాక్, చైనా మౌనంగా ఉండిపోయాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Mnd2bI
No comments:
Post a Comment