
సినీనటితో గుట్టుచప్పుడుకాకుండా వ్యభిచారం చేయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన షిపాంజలిరావు(43) కొన్నాళ్లుగా సినీనటులు, మోడళ్లతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. విటుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి అమ్మాయిలకు మాత్రం చాలా తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తోంది. Also Read: చాలాకాలంగా పోలీసులకు చిక్కకుండా దందా నిర్వహిస్తున్న షిఫాంజలి.. ఇటీవల ఓ బాలీవుడ్ నటి(33)ని మభ్యపెట్టి వ్యభిచారంలోకి దించింది. అనేక చిత్రాల్లో చిన్నచిన్న పాత్రలు వేసిన ఆ నటి ప్రస్తుతం ఆఫర్లు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న షిపాంజలి ఆమెను సంప్రదించి వ్యభిచారం చేస్తే కష్టాల నుంచి గట్టెక్కవచ్చని చెప్పి ఒప్పించింది. విటులను ఆకర్షిస్తూ ఆ నటి వద్దకు పంపించేది. Also Read: ఈ విషయం తెలుసుకున్న ముంబయి ఓషివారా పోలీసులు బుధవారం ఓ నకిలీ కస్టమర్‌ను ఆమె వద్దకు పంపించారు. బాలీవుడ్ నటితో గడపాలని కోరడంతో షిఫాంజలి అతడి నుంచి రూ.20వేలు తీసుకుని ఆమె వద్దకు పంపించింది. ఆ వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి షిఫాంజలిని అరెస్ట్ చేశారు. నటిని రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిందితురాలు గతంలో అనేక మంది యువతులను ఈ రొంపిలోకి దించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆమె వలలో చిక్కుకున్న యువతుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. Also Read: Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LLm8gB
No comments:
Post a Comment