Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 4 October 2019

బాలకోట్ ఎయిర్‌ స్ట్రైక్స్‌కు సాక్ష్యం ఇదిగో.. వీడియో రిలీజ్ చేసిన ఎయిర్‌ఫోర్స్

పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ బాలాకోట్ ఉగ్రవాద స్థావరంపై మెరుపు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 300 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని భారత ప్రధాని మోదీ ప్రకటించారు. బాలాకోట్ ఎయిర్‌స్ట్రైక్స్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియాను ఎయిర్‌ఫోర్స్ రిలీజ్ చేసింది. వైమానిక దళ దినోత్సవం సందర్భంగా ఎయిర్స్ ఫోర్స్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా ఈ వీడియోను ప్రదర్శించారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన పైలట్లు ఓ రూమ్‌లో మాట్లాడుంటుకున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తాయి. తర్వాత యుద్ధ విమానాల దగ్గరకు పైలెట్లు పరిగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలను చూడొచ్చు. 84 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఐఏఎఫ్ యుద్ధ విమానాలు టేకాఫ్ తీసుకుని బాలాకోట్ ప్రాంతంలో ఉగ్రశిబిరాలే లక్ష్యంగా బాంబులను జారవిడిచి, ధ్వంసం చేయడం చూడొచ్చు. భారత్, పాక్ యుద్ధ విమానాల మధ్య జరిగిన డాగ్ ఫైట్‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. భారత్ బాలాకోట్‌లో దాడులే చేయలేదంటున్న వారికి ఈ వీడియో రూపంలో ఎయిర్‌ఫోర్స్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చినట్లయ్యింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/330wz5L

No comments:

Post a Comment