Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 4 October 2019

రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి ఉరిశిక్ష విధించిన సుప్రీం

మహారాష్ట్రలో ఏడేళ్ల క్రితం రెండేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కేసులో సంచలనం తీర్పు వెలువరించింది. కామాంధుడికి మరణశిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. ఈ కేసులో బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. నిందితుడు శారీరక వాంఛ కోసం సామాజిక కట్టుబాట్లను విడిచి చిన్నారిపై దారుణానికి పాల్పడ్డాడని కోర్టు వ్యాఖ్యానించింది. Also Read: 2012లో ఈ ఘటన జరగగా గతంలో బోంబే హైకోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. న్యాయమూర్తులు జస్టిస్ నారీమన్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఆ తీర్పును సమర్థిస్తూ మరణశిక్ష విధించింది. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణశిక్ష విధించాలని పోక్సో చట్టంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. Also Read: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2oSeYOA

No comments:

Post a Comment