
2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన 2019 ఎన్నికల ముందు పార్టీలో చేరారు. పవన్ పార్టీ తరఫున లోక్ సభకు పోటీ చేసిన ఆయన ఓడారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిన ఆయన.. వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నారనే వార్తలొస్తున్నాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. దసరా వేళ ఆయన అధికార పార్టీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. గతంలో రావెల కిశోర్ బాబు జనసేనను వీడినప్పుడే.. ఆకుల సత్యనారాయణ కూడా పార్టీ మారతారనే వార్తలొచ్చాయి. కానీ ఆయన మాత్రం సైలెంట్ అయ్యారు. వైఎస్ హయాంలో కాపు నేతలు కాంగ్రెస్ పార్టీకి బలంగా మద్దతునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత చాలా మంది టీడీపీ వైపు మొగ్గారు. 2014 ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించింది. మళ్లీ కాపు నేతలను తమ వైపు తిప్పుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు గూటికి చేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను, కాపు నాయకులను తమ వైపు తిప్పుకుంటే పార్టీ మరింత బలపడుతుందనేది జగన్ యోచనగా ఉంది. మరోవైపు జనసేన పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శన చేసిన తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. రావెల కిశోర్ బాబు, పార్థసారథి తదితర నేతలు పార్టీని వీడారు. ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ మారారు. వలసలు జనసేన పార్టీని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2oMBRDk
No comments:
Post a Comment