
రాజకీయాల్లో మరో ట్విస్ట్. ఉపముఖ్యమంత్రి పదవికి ఎన్సీపీ నేత రాజీనామా చేశారు. సీఎం పదవికి ఫడ్నవీస్ కూడా రాజీనామా చేయొచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడుతారని సమాచారం. శరద్ పవార్ భార్య అజిత్‌తో మాట్లాడిన తర్వాత ఆయన మనసు మార్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం అజిత్‌తో చిన్నమ్మ మాట్లాడారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన మూడు రోజులకే అజిత్ పవార్ పదవిని వదులుకోవడం గమనార్హం. మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రంలోగా బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది. బలనిరూపణకు ముందే అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని నవంబర్ 22న ప్రకటించాయి. కానీ అర్ధరాత్రి హైడ్రామాతో.. తెల్లవారగానే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీకి మద్దతు ప్రకటించిన ఎన్సీపీ శాసనసభా పక్ష నేత అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేశారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2pNdzK2
No comments:
Post a Comment