
ప్రియుడి మోజులో పడిన మహిళ అతడిని రక్షించేందుకు ఐదేళ్ల కన్నబిడ్డ గొంతు కోసి చంపేససిన దారుణ ఘటన ఢిల్లీలో వెలుగుచూసింది. ఢిల్లీలోని ఓ మురికివాడకు చెందిన అనిత(22) అనే మహిళకు పెళ్లికి ముందే ధీరజ్ అనే యువకుడితో అక్రమ సంబంధం ఉంది. అయితే ఆమెకు తల్లిదండ్రులు స్థానికంగా ఉండే జయవీర్ అనే వ్యక్తితో వివాహం జరిపించారు. వీరిద్దరికీ ఓ మగబిడ్డ పుట్టాడు. కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే జయవీర్ క్రమంగా మద్యానికి బానిసై భార్యను వేధించడం మొదలుపెట్టాడు. Also Read: భర్త చేష్టలతో విసిగిపోయిన అనిత ప్రియుడు ధీరజ్ వద్దకు బిడ్డను తీసుకుని వెళ్లిపోయిన కొద్దిరోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే ధీరజ్ ఆదాయం కూడా అంతంతమాత్రమే కావడంతో వారు రెండు పూటలా తినడానికే ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఆకలి వేయడంతో అనిత్ కుమారుడు గట్టిగా ఏడుస్తున్నాడు. అదే సమయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ధీరజ్ ఆ పిల్లాడిని గోడకేసి కొట్టాడు. దీంతో బాలుడు అపస్మాకర స్థితికి వెళ్లిపోయాడు. ఆ ఘటనను ప్రత్యక్షంగా చూసిన అనిత ప్రియుడిని రక్షించుకునేందుకు తన కొడుకు గొంతు కోసి చంపేసింది. Also Read: ఈ ఘటన గురించి ధీరజ్ తన బంధువు ప్రదీప్‌కు చెప్పి సాయం కోరాడు. దీంతో అనిత, ధీరజ్, ప్రదీప్ కలిసి పిల్లాడి మృతదేహాన్ని ఖాజురి ఖాస్ ప్రాంతానికి వ్యాన్‌లో తీసుకెళ్లి కాలువలో మూటకట్టి పడేశారు. రెండ్రోజులుగా పిల్లాడు కనిపించకపోవడంతో స్థానికులు ఆరా తీయగా అనిత పొంతనలేని సమాధానాలు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త జయవీర్ భార్యను నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అనిత, ఆమె ప్రియుడి ధీరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపెట్టారు. దీంతో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2KVtYn3
No comments:
Post a Comment