Fact Check: అయోధ్య తీర్పు అనంతరం సోషల్ పోస్టులపై ప్రత్యేక నిఘా..!

విషయం: దశాబ్దాలుగా నెలకొన్న సమస్యకు సుప్రీంకోర్టు నవంబర్ 9న పరిష్కారం చూపించింది. అయితే అయోధ్య కేసు తీర్పు వెలువడిన అనంతరం నియమాలు, నిబంధనలు మారిపోతున్నాయని ప్రచారం జరిగింది. ఈ మేరకు నెటిజన్లు ఈ నియమాలు తెలుసా, వీటిని పాటించాలని షేర్ చేశారు. ఈ క్రమంలో టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ రీడర్ నిజమేంటో తేల్చాలని కోరాడు. ఇదే మెస్సేజ్ ఫేస్ బుక్‌, ట్విట్టర్ అకౌంట్లలోనూ వైరల్ అయింది. నిజం: అనంతరం సోషల్ మీడియాపై నిఘా ఉంటుందని, రూల్స్ మారతాయనన్నది కేవలం వదంతులేనని అయోధ్య పోలీసులు ట్వీట్ చేశారు. ఇలాంటి వదంతులు నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు యూపీ పోలీసులు విజ్ఞ‌ప్తి చేశారు. అయోధ్య పోలీసులు సైతం విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ట్వీట్లు చేయవద్దని, సోషల్ మీడియాపై నిఘా అంటూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేయవద్దని ట్వీట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డాక శాంతిపూర్వకంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకూడదని సూచించారు. విధ్వేషాన్ని పెంచే పోస్టులు చేస్తే ఐపీసీ 153ఏ సెక్షన్, ఐటీ చట్టం 66(ఏ) సెక్షన్ల ప్రకారం నేరంగా పరిగణిస్తామని అదే ట్వీట్ ద్వారా నెటిజన్లను హెచ్చరించారు. ఐక్యమత్యంగా ఉండాలని, వదంతులు నమ్మవద్దని సీనియర్ ఎస్పీ ఆశిష్ తివారీ కోరిన బైట్‌ను అయోధ్య పోలీసులు ట్వీట్ చేశారు. నిర్ధారణ: అయోధ్య కేసు తీర్పు అనంతరం సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందనడం, సోషల్ మీడియాలో కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయన్నది కేవలం వదంతులేనని టైమ్స్ (సమయం) ఫ్యాక్ట్ చెక్ టీమ్ గుర్తించింది. అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36RMrdD

Post a Comment

0 Comments