మోసాలు చేయడమే పనిగా పెట్టుకున్న బురిడీ బాబా భక్తుల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టాడు. అమాయకులైన భక్తులకు వలేసి.. తనకు అమ్మవారు కనిపించిందని, ఏది కోరుకుంటే అది నేరవేరేలా వరమిచ్చిందంటూ వారి నుంచి అందినికాడికల్లా దోచుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో అరెస్టయిన ఈ బురిడీ బాబా రూ.60కోట్లకు పైగా దోచుకోగా.. మళ్లీ బయటకు వచ్చి ఈ ఏడాది మరో రూ.40కోట్ల వరకు భక్తుల నుంచి గుంజేశాడు. తన మాయమాటలతో రెండేళ్లలో ఏకంగా రూ.100కోట్లు కొల్లగొట్టినట్లు తేలడంతో పోలీసులే షాకవుతున్నారు. Also Read: నెల్లూరు జిల్లాకు చెందిన గిరీశ్ కుమార్ (34) మాటకారి. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో సూళ్లూరుపేటలోని అమ్మమ్మ ఇంట్లో పెరిగాడు. ఇంటర్‌తో చదువు మానేశాడు. ఇంటిపక్కనే ‘బాలాత్రిపుర సుందరీదేవి’ ఆలయం ఉండటంతో అక్కడికి వెళ్లి ఆధ్యాత్మిక ప్రవచనాలు వినేవాడు. ఆ జ్ఞానాన్నే మోసాలకు ఆధారం చేసుకున్నాడు. స్వామీజీగా అవతారమెత్తి తనకు బాలాత్రిపుర సుందరీదేవి దర్శనమిచ్చిందని, తాను అమ్మవారికి సమస్యలు చెబితే తీరుస్తుందని నమ్మించి డబ్బులు వసూలు చేసేవాడు. Also Read: ఈ క్రమంలోనే 2012లో మాదాపూర్‌లో ఏఎస్ఆర్‌సీ కేంద్రాన్ని స్థాపించి భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేవాడు. ఒక్కో క్లాస్‌కు భక్తుల స్థాయిని బట్టి రూ. 10వేల నుంచి రూ. 2లక్షల దాకా వసూలు చేసేవాడు. 2024లో దేశానికి తానే ప్రధానినవుతానని డబ్బా కొట్టుకునేవాడు. కొన్నాళ్లకు 30 స్టార్ట్‌పలను ప్రారంభించానని.. అందులో రూ.1100 నుంచి రూ.66వేల దాకా పెట్టుబడి పెట్టొచ్చని.. అందులో చేరిన సభ్యులు ఇతరులను చేరిస్తే రూ.కోట్లలో కమిషన్ వస్తుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మి కొందరు రూ.కోట్లలో పెట్టుబడి పెట్టారు. దీంతో 2018లో ఏకంగా రూ.60కోట్లు సంపాదించాడు. Also Read: ఈ బురిడీ బాబా లీలలపై ఫిర్యాదులు రావడంతో గతేడాది డిసెంబరు 24న రాచకొండ పోలీసులు గిరీశ్‌ను అరెస్ట్ చేశారు. అయితే తనకున్న డబ్బు, పలుకుబడితో కొద్దిరోజుల్లోనే బెయిల్‌పై వచ్చేశాడు. మరోసారి అలాంటి ప్రకటనే చేసి ఈ ఏడాది రూ.40కోట్ల వరకు దోచేశాడు. ఆ డబ్బుతో ఖరీదైన కార్లు కొనడం, విదేశాల్లో ఎంజాయ్ చేసేవాడని పోలీసులు చెబుతున్నారు. గిరీశ్‌పై మోసాలపై లోతుగా దర్యాప్తు చేసేకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తుండటంతో పోలీసులే షాకవుతున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Z5RnrK
No comments:
Post a Comment