Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Thursday, 19 December 2019

సమయం లైవ్ న్యూస్: రోజాపై అసభ్య పోస్టులు.. రైతుల ఆందోళనలపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

⍟ రైతుల ఆందోళనలపై వైసీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు: సీఎం జగన్.. వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అంశాన్ని తెరపైకి తెచ్చారని, భూములిచ్చిన తమ పరిస్థితేంటని రైతులు నిలదీస్తున్నారు. సీఎం ప్రకటనను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. గురువారం నాడు అమరావతి ప్రాంతంలో బంద్‌ పాటించారు. ముఖ్యమంత్రి ప్రకటనను తప్పుబడుతూ విమర్శలు గుప్పించిడంపై నరసరావుపేట ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. రోజాపై అసభ్య పోస్టులు: నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజాతో పాటూ మరికొందరు వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేలు, నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అడిషనల్ డీజీపీ రవిశంకర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ మహిళా నేతలు ఫిర్యాదు ఇచ్చారు. ఈ పోస్టులకు సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అందజేశారు. ఉత్తరద్వార దర్శనంపై యూటర్న్: తిరుమలలో వైకుంఠద్వార దర్శనం పదిరోజుల పాటు కల్పించనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే, దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ప్రతిపాదనను వెనక్కుతీసుకుంది. కేవలం వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రెండు రోజులు మాత్రమే దర్శనం కల్పిస్తామని టీటీడీ పాలకమండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బెజవాడలో విషాదం: విజయవాడలో విషాద ఘటన జరిగింది. గాంధీనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. జగపతి హోటల్‌లో ప్రేమజంట గదిని అద్దెకు తీసుకోగా.. ఎంతసేపటికి బయటకు = రాకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే హోటల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా తలుపులు పగులగొట్టి చూశారు. ఈ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు గుర్తించారు. ⍟ సుప్రీంలో దిశ నిందితుల కుటుంబాలు పిటిషన్: తెలంగాణ పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురైన దిశ నిందితులు కుటుంబ సభ్యులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఫేక్ ఎన్‌కౌంటర్‌లో తమ వాళ్లను చంపేశారని.. దీనికి పరిహారంగా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీలో ఉన్నవారిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారని.. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని వారు ఆరోపించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని కోరారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2twprla

No comments:

Post a Comment