మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన కామాంధుడికి ఒడిశాలోని ఓ న్యాయస్థానం విధిచింది. కేంఝర్ పట్టణానికి చెందిన దంపతులకు మూడేళ్ల కుమార్తె ఉంది. 2017, జనవరి 13వ తేదీన సంతకు వెళ్లేందుకు ఆ దంపతులు కుమార్తెను ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన పక్కింట్లో ఉండే సునీల్ నాయక్.. చాక్లెట్లు కొనిస్తానని బాలికను నమ్మించి తనతో తీసుకెళ్లాడు. Also Read: బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు. కాసేపటి తర్వాత ఇంటికి వచ్చిన భార్యభర్తలు చిన్నారి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. మరుసటి రోజు గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ వంటగదిలో బాలిక రక్తపు మడుగులో కనిపించింది. పోస్టుమార్టం రిపోర్టు అత్యాచారం చేసి చంపేసినట్లు తేలడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: బాలికను సునీల్ నాయక్ ఎత్తుకుని తీసుకెళ్తుండగా చూశామని కొందరు గ్రామస్థులు చెప్పడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతడిని కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 28 మంది సాక్షుల వాంగ్మూలం తీసుకుని అతడిని దోషిగా నిర్ధారించింది. దీంతో సునీల్‌కు మరణశిక్ష విధిస్తూ కేంఝర్ అదనపు జిల్లా కోర్టు, ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి లోక్‌నాథ్ సాహు గురువారం తీర్పు వెలువరించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2s37vhC
No comments:
Post a Comment