⍟ దిశ నిందితుడి భార్యకు పదమూడేళ్లే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇక, దిశ నిందితుల్లో ఇద్దరు జొల్లు శివ, నవీన్ మైనర్లని వారి బోనఫైడ్ సర్టిఫికెట్లు చెబుతున్నాయి. తాజాగా, మరో నిందితుడు చెన్నకేశవులు భార్య మైనర్ అని తేలింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో భాగంగా నారాయణపేట జిల్లా బాలల సంరక్షణ విభాగం చెన్నకేశవులు గ్రామంలో శుక్రవారం ప్రాథమిక విచారణ జరిపింది. ⍟ భగ్గుమంటున్న అమరావతి రైతులు: రాజధానిపై ఏర్పాటు చేసిన జీఎన్‌రావు నిపుణుల కమిటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదికను అందజేసింది. ఈ రిపోర్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది.. ఏపీని నాలుగు రీజియన్లుగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ కమిటీ నివేదికపై అమరావతి రైతులు భగ్గుమన్నారు.. ఆందోళనలను మరింత ఉధృతం చేశారు. ⍟ నేడే జగన్ నేతన్ననేస్తం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం అనుకోవచ్చు. ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నారాయన. పార్టీ పెట్టి పదేళ్లయినా నిండక ముందే.. పోటీ చేసిన రెండో ఎలక్షన్‌తోనే భారీ మెజారిటీ సొంతం చేసుకుని.. అధికారం చేపట్టడంలోనే రికార్డ్ క్రియేట్ చేసారు జగన్. ⍟ చాగంటి ప్రవచనాల్లో కేసీఆర్: ఎక్కడికి వెళ్లినా రాని క్రమశిక్షణ గుడికి వెళ్తే వస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. భగవంతుడి గురించి చదివినా, విన్నా గొప్ప పుణ్యం దక్కుతుందన్నారు. చాగంటి కోటేశ్వర రావు మానవ జాతికి దొరికిన మణిపూస అని కొనియాడారు. చాగంటిని గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్టే అని వ్యాఖ్యానించారు. ⍟ చెట్టు నరికితే రూ.45 వేలు ఫైన్: సిద్దిపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి మంత్రి హరీశ్ రావు సంకల్పించారు. అధికారులు, ప్రజల చొరవతో సరికొత్త కార్యక్రమాలు చేపడుతున్నారు. పారిశుధ్య నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పట్టణంలో మొక్కలు, చెట్ల సంరక్షణ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ‘మొక్కలు నాటండి - పర్యావరణాన్ని కాపాడండి’ అంటూ పిలుపునిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2EDS4PL
No comments:
Post a Comment