Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Friday, 20 December 2019

YS Jagan Birthday: నేతన్ననేస్తం జగన్ పుట్టిన రోజునే ఎందుకంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకం అనుకోవచ్చు. ఎందుకంటే తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్నారాయన. పార్టీ పెట్టి పదేళ్లయినా నిండక ముందే.. పోటీ చేసిన రెండో ఎలక్షన్‌తోనే భారీ మెజారిటీ సొంతం చేసుకుని.. అధికారం చేపట్టడంలోనే రికార్డ్‌ క్రియేట్ చేసారు జగన్. కిందటి ఏడాది ఇదే రోజు ఆయన పాదయాత్రలో ఉన్నారు. ఈ సంవత్సరం తన పుట్టినరోజు నాడు చేనేతలకు ఆర్థికసాయం అందిస్తానని ప్రకటించారు. గత ఆరునెలల్లో వరుస సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ తన పుట్టిన రోజున ‘వైయస్సార్ నేతన్న నేస్తం’ పథకానికి శ్రీకారం చుడుతున్నారు. నా పుట్టినరోజు నాకు చేనేతలే గుర్తు వచ్చారన్నారు జగన్. అమ్మ ఒడి, నాడు-నేడు లాంటి ప్రతిష్టాత్మక పథకాలెన్నో ఉండగా దీన్ని మాత్రమే తన బర్త్‌డే రోజు లాంచ్ చేయడం ఏమిటి అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. చేనేతలతో తన తండ్రి వైయస్సార్‌కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకునేందుకే సీఎం జగన్ తన పుట్టిన రోజున పథకాన్ని ప్రారంభిస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఎప్పుడూ చేనేత వస్త్రాలే ధరించేవారు. వ్యవసాయ సదస్సుకు అమెరికాకు వెళ్లేటప్పుడు సూటు వేసుకోమన్నా, నేను రైతుబిడ్డను అంటూ చేనేత పంచె కట్టుతోనే సమావేశానికి హాజరయ్యారు. తానే కాదు ప్రభుత్వోద్యోగులంతా వారానికి రెండు రోజులు నేత వస్త్రాలు ధరించాలని డ్రెస్ కోడ్ పెట్టి, దానికి ఓ జీవో కూడా పాస్ చేసారు. నేతకార్మికుల పట్ల వైయస్సార్‌కు అంత అభిమానం ఉండేది. 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.327 కోట్ల చేనేత రుణాలను బేషరతుగా మాఫీ చేశారు. బాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. చేనేత కార్మికులకు పావలా వడ్డీ రుణాలు, 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, నెలకు 35 కిలోల బియ్యం, అత్యంత వెనుకబడిన చేనేత కార్మికులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం, ఇళ్లు, చేనేత కార్మికుల పిల్లలకు ఫీజ్‌ రీయంబర్స్‌మెంట్ వంటివి ఎన్నో చేసి ఆదుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పోచంపల్లిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసి 10,000 మంది నేత కార్మికులకు ఉపాధి కల్పించారు. ఆగస్టు 7ను చేనేత దినోత్సవంగా జరపాలని ఆదేశాలు జారీచేశారు. తండ్రి వైయస్సార్ మాత్రమే కాదు జగన్ కూడా పాదయాత్ర సమయంలో చేనేతల కష్టాలు కళ్లారా చూసి చలించిపోయానని స్వయంగా చెప్పారు. గతంలో ప్రతిపక్ష నేతగా చేనేత కార్మికుల దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు తీర్చలేక, మగ్గం పని చేసేందుకు పెట్టుబడి కరువై, పని లేక పస్తులుంటున్న కుటుంబాలను చూసి ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. ఒక రోజు ఆరోగ్యం సహకరించక, పని చేయలేకపోతే పూటగడవని స్థితిలో ఉన్నామని మహిళలు ఆవేదనతో చెప్పడం విని, వారికోసమే 45 ఏళ్లకే పింఛను పథకం గురించి పాదయాత్ర ప్రారంభంలో ప్రకటించారు. అయితే అంత తక్కువ వయసుకే పింఛన్లు ఇస్తాననడంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పింఛన్ల బదులుగా వారికి ఏటా ఆర్థిక సాయం అందించేలా పథకంలో మార్పులు చేశారు. చేనేతల పట్ల తండ్రి సెంటిమెంట్‌ను జగన్ కొనసాగిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డ్, మగ్గం ఉన్న చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24000 ఆర్థిక సాయం అందిస్తున్నారు. సుమారు 85,000 కుటుంబాలు ఈ స్కీం ద్వారా లబ్ది పొందుతున్నాయి. డిసెంబర్ 21న తన 47వ పుట్టినరోజున అనంతపురంలోని ధర్మవరంలో వైయస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం ప్రారంభిస్తున్నారు. ఆన్‌లైన్లో ఆంధ్రా చేనేత - అమెజాన్‌, ఫ్లిప్‌కార్టుల్లో నేతన్నల ఉత్పత్తులు ఏపీ చేనేత వస్త్రాలు ఇకపై ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం అమెజాన్‌, ఫ్లిప్‌కార్టులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అమెజాన్‌లో నవంబర్‌ 1 నుంచి అమ్మకాలు ప్రారంభం అయ్యాయి. చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేసి ఆన్‌లైన్లో అమ్మకానికి పెడతారు. తొలిదశలో భాగంగా 25 రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. ఆన్‌లైన్‌లో వీటి ధరలు రూ.200 మొదలుకుని రూ.20,000 వరకూ ఉండేలా చర్యలు తీసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో కంటే ఆన్‌లైన్‌లో ధరలు తక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దీనవల్ల చేనేత కార్మికుల ఉత్పత్తులు దేశీయంగానే కాదు అంతర్జాతీయంగానూ అమ్ముడుపోతాయి. మధ్యవర్తులు, దళారుల నుంచి విముక్తి దొరుకుతుంది. చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మొత్తంగా ఏపీలోని చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చేందుకు, మార్కెటింగ్ సమస్యలు అధిగమించి గ్లోబల్ మార్కెట్‌ లో తమదైన ముద్ర వేసేందుకు నేతన్నలు సిద్ధమౌతున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36YWpZM

No comments:

Post a Comment