పత్రికలో ప్రకటన చూసి బోలెడంత ఆదాయం వస్తుందని ఫోన్ చేస్తే.. చివరకు నిండా మునిగింది. లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాక చివరకు మోసపోయినట్లు గ్రహించింది. హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (60) ఆంగ్ల దినపత్రికలో వచ్చిన ఓ ప్రకటనను చూసింది. సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటుకు అనువైన స్థలం కావాలని అందులో ఉంది. దీంతో వివరాలు తెలుసుకునేందుకు ప్రకటనలో ఉన్న మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసింది. అటువైపు మాట్లాడిన వ్యక్తి తాము ప్రముఖ సెల్‌పోన్ సంస్థ ప్రొవైడర్లమని చెప్పాడు. తమ సంస్థ ఏర్పాటు చేయబోయే టవర్‌కు సరైన ప్రాంతం మీదేనంటూ బురిడీ కొట్టించాడు. ఏడాదికి ఏకంగా రూ.90 లక్షల ఆదాయం వస్తుందని, ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో జమచేస్తామని ఊదరకొట్టాడు. Also Read: అతగాడు చెప్పింది మంచి పేరున్న సంస్థ కావటంతో మహిళ కూడా నిజమనే అభిప్రాయానికి వచ్చింది. ఒప్పందంలో భాగంగా రిజిస్ట్రేషన్ ఫీజులకు అని చెప్పి మొదట రూ.5,000 వసూలు చేశాడు. కొద్దిరోజులకు టవర్ నిర్మాణానికి డిపాజిట్‌గా రూ. 5 లక్షలు రాబట్టాడు. ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపుతూ వీలైనంత సొమ్ము బ్యాంకు ఖాతాలో జమచేయించుకున్నాడు. పెద్దఎత్తున ఆదాయం వస్తుందని ఆశపడ్డ బాధితురాలు డబ్బు చెల్లించేందుకు సొంత ఆస్తులను సైతం విక్రయించింది. ఇలా పలుదఫాలుగా నవంబర్ 15 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు దాదాపు రూ. 25 లక్షలు మోసగాడు చెప్పిన ఖాతాలో జమచేసింది. చివరకు తాను మోసపోయినట్టు గ్రహించి సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/353dn7Z
No comments:
Post a Comment