Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Saturday, 28 December 2019

చలి గుప్పిట్లో ఉత్తరాది.. ద్రాస్‌లో మైనస్ 28 డిగ్రీల ఉష్ణోగ్రత

దేశవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగి ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ శీతాకాలం మొదలైన రెండు నెలల తర్వాత ఉష్ణోగ్రతలు ఇంతగా పడిపోవడం ఇదే తొలిసారి. ఉత్తరాది రాష్ట్రాలు చలి గుప్పెట్లో చిక్కుకున్నాయి. ఆదివారం కూడా అతిశీతల వాతావరణం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఢిల్లీ, పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, యూపీ, బిహార్‌లలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. డిసెంబరు 31 వరకు పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీ చలికి గజగజ వణికిపోతోంది. శనివారం నాడు ఢిల్లీలో ఉష్ణోగ్రత 2.4 డిగ్రీలుగా నమోదుకావడంతో ఈ సీజన్‌లోనే అత్యంత చల్లటి రోజని అధికారులు ప్రకటించారు. ఢిల్లీలో దట్టంగా అలముకున్న పొగమంచుతో జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువ నమోదైంది. పొగమంచు కమ్మేయడంతో విమానాలు, రైళ్లు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా 24 రైళ్లు ఆలస్యంగా నడిచాయి. నాలుగు విమానాలను ఢిల్లీ విమానాశ్రయం నుంచి దారి మళ్లించారు. జ జమ్మూ-కశ్మీర్‌, లడఖ్‌లు అత్యంత శీతల వాతావరణంతో వణికిపోతున్నాయి. లేహ్‌, ద్రాస్‌ సెక్టార్‌లో ఉష్ణోగ్రతలు మైనస్‌ 19.1, మైనస్‌ 28.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. ఉత్తర కశ్మీర్‌ని ప్రఖ్యాత స్కీయింగ్‌ రిసార్ట్‌ గుల్‌మార్గ్‌ వద్ద ఉష్ణోగ్రత మైనస్‌ 7.5 డిగ్రీల సెల్సియస్‌‌కు పడిపోయింది . పంజాబ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ల్లోని పలుప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. చలికి చండీగఢ్‌లో గుర్తుతెలియని ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి మృతి చెందాడు. హర్యానాలోని రేవారీ జిల్లాలోని ఢిల్లీ- జైపూర్ జాతీయ రహదారిపై పొగ మంచు కారణంగా 15 వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. పంజాబ్, హర్యానాలో సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుఫ్రీ, మనాలీ, సోలన్, భుంతార్, సుందేర్‌నగర్, సియోబాగ్, కల్పాలో మంచు గుప్పిట్లో చిక్కుకున్నాయి. యూపీలో మీరట్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీలు, రాజస్థాన్‌లోని సికార్‌లో మైనస్ 1.5 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒడిశాలోనూ ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం చలికి వణుకుతున్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలుగా నమోదుకావడంతో ఉదయం 10 గంటల దాటిన వరకు జనం ఇళ్ల నుంచి బయటకు రావడలేదు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Svs6pQ

No comments:

Post a Comment