ప్రభుత్వాలు ఎన్ని కఠినచట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అపరిచితులే కాకుండా తెలిసినవారి చేతుల్లోనే అబలలు బలైపోతున్నారు. ఓ నేరంలో స్నేహితులు జైలుకెళ్లడంతో ఒంటరిగా ఉన్న అతడి భార్య కన్నేసిన ఓ కామాంధుడు అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీరా ఆమె గర్భం దాల్చడంతో కనిపించకుండా ఉడాయించాడు. Also Read: గోరేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన యువకుడు భార్యతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతడిపై ఓ నేరం నిరూపణ కావడంతో కోర్టు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. అతడు జైలుకెళ్లడంతో భార్య ఒంటరిగా ఉంటోంది. దీన్ని అవకాశంతో మలుచుకున్న యువకుడి ఫ్రెండ్ తరుచూ ఆమె ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఏం కావాలన్నా చేసిపెడుతూ ఆమెకు దగ్గరయ్యాడు. ‘నీ భర్తను వదిలేస్తే నేను పెళ్లి చేసుకుంటాను’ అంటూ నమ్మించాడు. ఓ అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లిన అతడు మహిళను మభ్యపెట్టి శారీరకంగా లొంగదీసుకున్నాడు. Also Read: పెళ్లి చేసుకుంటానన్న సాకుతో ఆమెను చానాళ్లుగా లైంగికంగా అనుభవిస్తున్నాడు. ఇటీవల మహిళ గర్భం దాల్చడంతో పెళ్లి చేసుకోవాలని అతడిని కోరింది. దీంతో ఆ కామాంధుడు పెళ్లి చేసుకోనని చెప్పి పరారయ్యాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ తెలియకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి పేరుతో శారీరకంగా వాడుకుని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37mToD5
No comments:
Post a Comment