మూఢనమ్మకంతో రాక్షసులుగా ప్రవర్తించిన వారు తగిన మూల్యం చెల్లించుకున్నారు. చేతబడి అనుమానంతో ఇద్దరిని అతి దారుణంగా హతమార్చిన వారంతా ఇప్పుడు జీవిత ఖైదీలుగా మారారు. జిల్లా మక్కువ మండలం ఎస్ పెద్దవలస పంచాయతీలోని కేకే వలస గ్రామానికి చెందిన 12 మందికి జీవత ఖైదు విధిస్తూ బొబ్బిలిలోని రెండో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి బి శ్రీనివాసరావు శుక్రవారం తీర్పు వెలువరించారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్ షణ్ముఖరావు తెలిపిన వివరాల ప్రకారం.. కేకే వలసలో నివాసం ఉంటున్న జన్ని శ్రీను కాలికి దెబ్బ తగలడంతో అనారోగ్యంపాలై 2016 జనవరి 8వ తేదీన మృతి చెందాడు. ఆయన మృతికి గ్రామంలో ఉన్న గొల్లూరి పండు, సీతమ్మల చేతబడే కారణమంటూ గ్రామస్తులంతా తర్వాతి రోజు గ్రామంలోని పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టించారు. అయితే పంచాయితీని అదే నెల 12కు వాయిదా వేశారు. ఇంతలోనే గ్రామానికి చెందిన 13 మంది జనవరి తొమ్మిదో 9న సాయంత్రం పండు, సీతమ్మలను రాళ్లతో కొడుతూ, తన్నుకుంటూ సమీపంలోని చిట్టిగెడ్డ వరకూ ఈడ్చుకుపోయారు. Also Read: అక్కడ కొనప్రాణం ఉండగానే వారిని సజీవ దహనం చేశారు. అదే రోజు రాత్రి వారి చితాభస్మాన్ని కాలువలో పారబోశారు. అనంతరం దంపతులను దహనం చేసిన చోట కడిగేసి సాక్ష్యాలను మిగల్చకుండా చేశారు. అయితే తల్లిదండ్రులు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి వారి రెండో కుమార్తె సూరమ్మ మక్కువ పోలీసు స్టేషన్‌లో జనవరి 13న ఫిర్యాదు చేసింది. తమ తల్లిదండ్రులను సజీవ దహనం చేశారని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. వెంటనే సాలూరు సీఐ జి.రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించారు. 13 మందిపై కేసు నమోదు చేసి కోర్టుకు సమర్పించారు. అలాగే గ్రామంలోని ఓ వ్యక్తి ఈ హత్యోదంతాన్ని తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసులు దానినే కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు. పార్వతీపురం, కోర్టుల్లో పలుమార్లు ఈ వీడియోను న్యాయమూర్తులు స్వయంగా పరిశీలించారు. Also Read: బొబ్బిలిలో తుదితీర్పు.. పలుమార్లు విచారణ అనంతరం చివరిగా శుక్రవారం బొబ్బిలి రెండో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి బి.శ్రీనివాసరావు 12 మంది నిందితులను నేరస్తులుగా పరిగణిస్తూ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అలాగే ఒక్కొక్కరికి రూ. 2,600 చొప్పున జరిమానా విధించారు. అలాగే ఫిర్యాదు దారయిన గొల్లూరి పండు, సీతమ్మల కుమార్తెలకు రూ.5 లక్షల పరిహారాన్ని చెల్లించాలని జిల్లా న్యాయ సలహా సంఘానికి సిఫార్సు చేశారు. 13 మంది నిందితుల్లో ఒకరైన గొల్లూరి అర్జున నేరం చేయరాదని మిగతా వారిని వారించినట్లు రుజువు కావడంతో అతనిని నిర్దోషిగా విడుదల చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. కాగా, బొబ్బిలిలో తుది తీర్పు వెలువడనుందని తెలియడంతో కోర్టుకు పలు వాహనాల్లో 13 మంది నిందితుల కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధువులు కోర్టుకు చేరుకున్నారు. న్యాయమూర్తి తీర్పు వెలువరించగానే 12 మంది నేరస్తుల కుటుంబ సభ్యులు, వారి పిల్లలు, తల్లిదండ్రులు ఒక్క సారి ఘొల్లుమన్నారు. వీరిని కాసేపు నేరస్థులతో మాట్లాడించేందుకు అవకాశమిచ్చిన పోలీసులు వెంటనే తిరిగి బయటకు పంపేశారు. అలాగే బాధిత గొల్లూరి పండు, సీతమ్మల దంపతుల ముగ్గురు కుమార్తెలు చోడిపల్లి రాధ, సూరమ్మ, గొల్లూరు నరసమ్మ సహా బంధువులు, కుటుంబ సభ్యులు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2t7I3YB
No comments:
Post a Comment