పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో పాల్గొని అరెస్టయిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దారాపురిని పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. పోలీసులు తనను మెడపట్టి నెట్టేశారని ఆరోపించారు. తాజాగా, ఈ అంశంపై ప్రియాంక భర్త స్పందించారు. ప్రియాంక పట్ల వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు మహిళా పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకుంటే మరొకరు కిందకు నెట్టేయడంతో ఆమె కిందపడిపోయారు... కానీ ఆమె భయపడకుండా బైక్‌పై మాజీ ఐపీఎస్ దారాపురి ఇంటికి వెళ్లి ఆయనను కలిశారని పేర్కొన్నారు. ‘ప్రియాంక నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను. నీ అవసరం ఉన్నవారిని వెళ్లి కలిశావు... నువ్వు చేసిన పని సరైందే.. అవసరం అయిన వారిని కలుసుకోవడం నేరం కాదు’ అంటూ వాద్రా ట్వీట్ చేశారు. శనివారం నాడు లక్నోలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు హాజరైన ప్రియాంక.. అనంతరం పోలీసుల కళ్లుగప్పి మాజీ ఐపీఎస్ అధికారి దారాపురి ఇంటికి వెళ్లారు. పోలీసులు ఆమె వాహనాన్ని అడ్డుకోగా కారు దిగి నిరసన వ్యక్తం చేసిన ప్రియాంక.. నడుస్తూ ముందుకెళ్లారు. కిలోమీటరు దూరం ఆమె నడవగా పోలీసులు సైతం అనుసరించారు. ఆ తర్వాత మళ్లీ వాహనం ఎక్కిన ప్రియాంకను పోలీసులు అడ్డుకోగా కిందికి దిగిన ఆమె ద్విచక్రవాహనంపై కొంతసేపు ప్రయాణించారు. దీంతో పోలీసులపై మండిపడ్డ ప్రియాంక.. కావాలంటే తనను అరెస్టు చేసుకోవచ్చన్నారు. ఈ సమయంలో మహిళా కానిస్టేబుళ్లు తనను ప్రియాంక నెట్టివేశారని ఆరోపించారు. పోలీసులు మాత్రం ప్రియాంక ఆరోపణల్ని తోసిపుచ్చారు. తప్పుడు ఆరోపణలతో ఓ మహిళా పోలీస్ అధికారిని బలిపశువుని చేయాలని ప్రియాంక ప్రయత్నిసున్నారని యూపీ ప్రభుత్వ ప్రతినిధి ఆరోపించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2F1yaOL
No comments:
Post a Comment