ప్రియురాలితో సినిమా హాల్‌కు వెళ్లిన ఓ వ్యక్తి భార్య చేతిలో చావుదెబ్బలు తిన్న ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. నవరంగ్‌పురా ప్రాంతానికి చెందిన రమేశ్(పేరు మార్చాం) అనే వ్యక్తి భార్య, పిల్లలున్నారు. ప్రైవేటు సంస్థలో పనిచేసే అతడు ఇటీవల ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడప్పుడు ఆఫీసుకి వెళ్లకుండా ప్రియురాలితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగేవాడు. Also Read: ఇదే మాదిరిగా రమేశ్ శుక్రవారం తన ప్రియురాలితో కలిసి ఓ సినిమా థియేటర్‌కు వెళ్లాడు. ఓ మూలన కూర్చుని చీకట్లో ప్రియురాలితో చిలిపి పనులు చేయడం ప్రారంభించాడు. ఇంటర్వెల్ సమయంలో రమేశ్‌ను వేరే అమ్మాయితో చూసిన ఫ్రెండ్ వెంటనే అతడి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో అపరకాళిలా మారిన ఆమె వెంటనే థియేటర్‌లోకి వచ్చి చూడగా రమేశ్ ప్రియురాలితో సన్నిహితంగా కనిపించాడు. దీంతో భర్తను కాలర్ పట్టుకుని బయటకు ఈడ్చుకొచ్చి చితక్కొట్టింది. Also Read: రమేశ్‌ను కొట్టడాన్ని అడ్డుకున్న అతడి ప్రియురాలినీ ఆమె విచక్షణా రహితంగా చావబాదింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ముగ్గురిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత బయటకు పంపారు. మరోసారి ఇలాంటి చిలక్కొట్టుడు పనులు చేస్తే జైల్లో పెడతామని పోలీసులు రమేశ్‌ను హెచ్చరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37if7Mf
No comments:
Post a Comment