తెలంగాణలోని జిల్లా ఆసిఫాబాద్‌లోని ఓ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని గర్భం దాల్చడం కలకలం రేపింది. అయితే ప్రేమ వ్యవహారమే విద్యార్థిని గర్భానికి కారణమని అధికారుల విచారణలో తేలింది. గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో చదువుతున్న నలుగురు విద్యార్థినులు గర్భం దాల్చినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. అయితే అధికారులకు కళాశాల యాజమాన్యం తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల 10 మంది విద్యార్థినులకు రుతుస్రావం సమస్య ఎదురైంది. దీంతో నవంబర్ 21న కళాశాల సిబ్బంది ఆదిలాబాద్ రిమ్స్‌లో వీరికి పరీక్షలు చేయించారు. ఇందులో ముగ్గురిపై అనుమానంతో గర్భనిర్ధారణ పరీక్షలు చేయించగా.. వారికి మొదట పాజిటివ్ వచ్చింది. Also Read: దీన్ని ధ్రువీకరించేందుకు మళ్లీ వారం తర్వాత రావాలని వైద్యులు సూచించారు. అయితే కళాశాల సిబ్బంది మళ్లీ రిమ్స్‌కు వెళ్లకుండా స్థానికంగా ఉన్న ఆస్పత్రిలోనే వైద్య పరీక్షలు చేయించారు. ఇందులో ఒక విద్యార్థిని మాత్రమే గర్భం దాల్చినట్లు తేలింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో శనివారం ఆసిఫాబాద్ ఆర్డీఓ సిడాం దత్తు, గిరిజన సంక్షేమ శాఖ జీసీడీవో శంకుతల, డీసీపీవో మహేశ్, ఐసీడీఎస్ పీడీ సావిత్రి శనివారం విచారణ చేపట్టగా.. గర్భానికి ప్రేమ వ్యవహారమే కారణమని సదరు విద్యార్థిని ఒప్పుకుంది. విద్యార్థినుల ఆందోళన?గురుకుల కళాశాలలో విద్యార్థిని గర్భం దాల్చడంపై మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో ఆ కళాశాల విద్యార్థినులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: తమ కళాశాలకు చెడుపేరు వచ్చేలా మీడియాలో ప్రచారం చేశారని, ఇందులో ప్రిన్సిపాల్ పాత్ర ఏమీ లేదని వసతిగృహ భవనం ఎదుట ధర్నాకు దిగారు. ఆసిఫాబాద్ డీఎస్పీ సత్యనారాయణ విద్యార్థినులతో మాట్లాడి శాంతిపజేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ కోసం ఆర్డీఓ లక్ష్మయ్య శనివారం రాత్రి ఆలస్యంగా రావడంపై విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకుని ఆందోళన చేశారు. సంఘటన విషయం శుక్రవారమే తెలిసినా.. విచారణ కోసం ఇంత ఆలస్యంగా రావడమేంటని ప్రశ్నించారు. రాత్రి వేళ కాకుండా ఆదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాలు, పాత్రికేయుల సమక్షంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన నేపథ్యంలో కళాశాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2MDGtop
No comments:
Post a Comment