విజయవాడలో వడ్డీ వ్యాపారులు మరోసారి రెచ్చిపోయారు. వేధింపులు తాళలేక ప్రేమ్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెల్ఫీ సూసైడ్ వీడియో తీసిన బాధితుడు తన చావుకు కారణమైన వారి వివరాలు చెప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అమరావతి ప్రాంతంలో కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. Also Read: విజయవాడకు చెందిన ప్రేమ్ అనే యువకుడు కొంతకాలం క్రితం వడ్డీకి రూ.నాలుగున్నర లక్షల డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అయితే వడ్డీ పేరుతో అతడిని వేధించిన వ్యాపారులు ఏకంగా రూ.16లక్షల వడ్డీ వసూలు చేశారు. అయినప్పటికీ ఇంకా డబ్బు కట్టాలంటూ వేధించసాగారు. దీంతో విసిగిపోయిన బాధితులు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకుని.. కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేశ్ వేధింపులు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. Also Read: రూ.4.50లక్షల అప్పుకు రూ.16లక్షల వడ్డీ కట్టినా ఆ నలుగురు నన్ను వదిలిపెట్టలేదని, దీనిపై పటమట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని ప్రేమ్ సెల్ఫీ వీడియోలో తెలిపారు. పోలీసుల ఎదుటే తనను కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రేమ కాలువలో దూకినట్లు తెలియగానే విజయవాడ పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడి మృతదేహం ఇంకా దొరకలేదు. మరోవైపు తన భర్త ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రేమ భార్య పోలీసులను డిమాండ్ చేస్తోంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/39lsQnt
No comments:
Post a Comment