Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Sunday, 29 December 2019

మూవీ మొఘల్ రామానాయుడు ఇంట్లో భారీ చోరీ.. ఎంత సొత్తు దోచేశారంటే..?

మూవీ మొఘల్‌, మాజీ ఎంపీ దివంగత దగ్గుబాటి సొంత ఊరిలోని ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బీరువాలు పగులగొట్టి దొరికినకాడికి దోచుకెళ్లారు. శుక్రవారం అర్ధరాత్రి జిల్లా చినవంతెన సమీపంలో ఈ ఘటన జరిగింది. ఏకంగా రామానాయుడు ఇంట్లోనే దొంగలు పడ్డారని తెలియడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కారంచేడు నడిబొడ్డున ఉన్న చినవంతెన సెంటర్‌, లైబ్రరీ బజారులో దివంగత రామానాయడు ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ప్రస్తుతం ఆయన సోదరుడు దగ్గుబాటి రామ్మోహన్‌రావు (మోహన్‌బాబు) నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెలు హైదరాబాద్‌లో ఉంటుండటంతో రామ్మోహన్‌రావు దంపతులు తరుచూ హైదరాబాద్‌ వెళ్లి వస్తుంటారు. అదే క్రమంలో ఈ నెల 16వ తేదీన వారు హైదరాబాద్‌ వెళ్లారు. Also Read: ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించిన దొంగలు.. పక్కా ప్రణాళికతో దొంగతనానికి పాల్పడ్డారు. ఇంట్లో పనులు చేసే నరసింహారావు, సుజాత దంపతులు శనివారం ఉదయం వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే గ్రామంలోనే ఉండే ఆఫీస్‌ మేనేజర్‌ తాళ్లూరి శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్ని బీరువాలు, అలమరలు పగులగొట్టి ఉండటంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. చీరాల రూరల్‌ సీఐ జె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి క్లూస్‌ టీమ్‌తో పాటు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. విషయం తెలిసిన సినీ నిర్మాత, నటుడు, మోహన్‌బాబు బావమరిది అయిన కొల్లా అశోక్‌కుమార్‌ వచ్చి పోలీసులకు వివరాలు అందించారు. సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి పరిశీలించి పోలీసు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 10 కేజీల వెండి మాయం బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో 10 కేజీల వెండి వస్తువులు, మూడు సవర్ల బంగారం, రూ. 60 వేల నగదు చోరీకి గురయ్యారని సీఐ శ్రీనివాసరావు వివరించారు. మోహన్‌బాబు దంపతులు హైదరాబాద్‌ నుంచి వస్తున్నారని, వారు వచ్చిన తర్వాత చోరీ సొత్తు వివరాలు పూర్తిగా తెలుస్తాయని, అప్పుడు పూర్తి స్ధాయి విచారణ చేపడతామని సీఐ వివరించారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/356gc8D

No comments:

Post a Comment