
తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖ జిల్లా సబ్బవరం మండలం అమృతపురంలో బుధవారం జరిగింది. అమృతపురం గ్రామానికి చెందిన వడిశెల నాగరాజు, కోటపాడు మండలం గవరపాలెం గ్రామానికి చెందిన చెందిన కృష్ణవేణికి 12ఏళ్ల కిందట వివాహమైంది. వారికి యశస్విని(11), మహేష్ (8) సంతానం. Also Read: ఈ క్రమంలోనే మంగళవారం అర్ధరాత్రి కృష్ణవేణి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 3.45గంటల సమయంలో అత్తమామలకు ఫోన్ చేసిన నాగరాజు కృష్ణవేణికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆస్పత్రిలో జాయిన్ చేశాడని, కొద్దిసేపటికి చనిపోయిందని చెప్పాడు. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్న వారు విగతజీవిగా పడివున్న తమ కూతురిని చూసి విలపించారు. Also Read: తమ కూతురిని అదనపు కట్నం, బంగారం తీసుకురావాలంటూ కొంతకాలంగా అత్త కన్నమ్మ, మామ వెంకునాయుడు చిత్రహింసలు పెడుతున్నారని, భర్త కూడా అనుమానంతో వేధిస్తున్నాడని వారు ఆరోపించారు. వారిపై సబ్బవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వరకట్న వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/385exBq
No comments:
Post a Comment