
తమిళనాడులోని తిరుపత్తూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జవ్యాది కొండ సమీపంలో ఓ వివాహితపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జవ్యాది కొండ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఉపాధి నిమిత్తం కొంతకాలంగా బెంగళూరులో ఉంటుండగా.. అతడి భార్య ఒంటరిగా జీవిస్తోంది. దీంతో ఆమెపై అదే గ్రామానికి చెందిన అలగేశన్ అనే యువకుడు కన్నేశాడు. Also Read: మంగళవారం సాయంత్రం ఇంటి సమీపంలో పొలానికి వెళ్లిన మహిళను అలగేశన్ అడ్డగించాడు. కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. ఆమె తిరస్కరించి పరుగు పెట్టడంతో అతడితో పాటు వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఆమెను పట్టుకుని బంధించారు. అలగేశన్ ఆ మహిళను భుజంపై ఎత్తుకుని సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మిగిలిన ముగ్గురు వ్యక్తులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. Also Read: బుధవారం ఉదయం పొదల్లో నగ్నంగా పడివున్న మహిళను చూసిన స్థానికులు వెంటనే తిరుపత్తూర్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనను నలుగురు యువకులు రేప్ చేసినట్లు చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి చెప్పిన వివరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2VpzCE1
No comments:
Post a Comment