Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

కోవిడ్: 2,804కి చేరిన మృతులు.. కొరియా, ఇటలీ, ఇరాన్‌లో ప్రమాద ఘంటికలు

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరిస్తోంది. చైనాలోని వుహాన్‌లో ప్రారంభమైన ప్రాణాంతక వైరస్ లాటిన్ అమెరికా వరకూ చేరింది. బ్రెజిల్‌లో తొలి కరోనా వైరస్ కేసు నమోదయ్యింది. ఇప్పటి వరకు కోవిడ్ 19తో మృతిచెందిన వారి సంఖ్య 2,804కు చేరుకోగా, బాధితుల సంఖ్య 82,166 దాటింది. చైనా వెలుపల దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటలీ (12), ఇరాన్ (19), దక్షిణ కొరియా (14) మంది వైరస్‌తో మృత్యువాతపడ్డారు. చైనాలో బుధవారం మరో 32 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 435 కొత్త కేసులు నమోదయ్యాయి. హుబే ప్రావిన్సుల్లో 29 మంది చనిపోగా, మిగతా ముగ్గురు వేర్వేరు చోట్ల మృతిచెందినట్టు చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ తెలిపింది. ఇప్పటి వరకు 32,569 మంది కోలుకున్నారని అధికారులు వెల్లడించారు. మరో 8,346 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు. చైనాలో వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతున్నా మిగతా దేశాల్లో మాత్రం బాధితులు, మృతుల సంఖ్య పెరగడంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇప్పటి వరకు మొత్తం 48 దేశాల్లో కరోనా వైరస్ విస్తరించింది. యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌకలో మృతిచెందినవారి సంఖ్య ఏడుకు పెరిగింది. దక్షిణ కొరియాలో 1597, ఇటలీలో 470, జపాన్‌లో 190 కేసులు బయటపడ్డాయి. డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని 700 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అటు, నౌకలోని భారతీయులు గురువారం ఉదయం స్వదేశానికి చేరుకున్నారు. వీరిని చావ్లాలోని ఐటీబీపీ శిభిరానికి తరలించి 14 రోజుల పాటు పరిశీలనలో ఉంచనున్నారు. దక్షిణ కొరియాలో బుధవారం 334 కొత్త కేసులు గుర్తించగా, రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. డేగులోని షించియోజీ చర్చ్ సభ్యులైన 2,10,000 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దేశం మొత్తం కేసుల్లో ఇక్కడ బాధితులే సగం ఉన్నారు. ఆసియా, ఐరోపా, మధ్య ఆసియాలో కరోనా వైరస్ ప్రబలమవుతున్న వేళ అగ్రరాజ్యం కూడా అప్రమత్తమయ్యింది. కోవిడ్‌ను ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అటు సౌదీ అరేబియా మదీనా సందర్శనకు వచ్చే యాత్రికులను తాత్కాలికంగా నిషేధించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ అరేబియా విదేశాంగా శాఖ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కరోనా వైరస్ కేసులు నమోదయిన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసాలను కూడా రద్దుచేసింది. అంతేకాదు, వైరస్ ఉన్నదేశాలకు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని తమ పౌరులకు సూచించింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32x1vM3

No comments:

Post a Comment