Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 26 February 2020

జగన్ సర్కారు మరో ముందడుగు.. రాష్ట్రంలో 42 గ్రామ న్యాయాలయాలు

ఏపీలో 42 గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి గొంతు మనోహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ స్థాయిలోనే సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేస్తోంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 విలేజ్ కోర్టులను ఏర్పాటు చేస్తుండగా.. ప్రకాశం జిల్లాలో 8, నెల్లూరు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో మూడు చొప్పున ఏర్పాటు చేస్తారు. విశాఖ, కృష్ణా, అనంతపురం, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున గ్రామ న్యాయాలయాలను ఏర్పాటు చేయనున్నారు. చిత్తూరు, తూర్పు గోదావరి, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున విలేజ్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. ప్రకాశం జిల్లాలో సింగరాయకొండ, కందుకూరు, పామూరు, మార్కాపురం, యర్రగొండపాలెం, మార్టూరు, సంతనూతలపాడు, ఒంగోలులో విలేజ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ న్యాయాలయాల చట్టం 2008 ప్రకారం మనదేశంలో లేదా మొబైల్ విలేజ్ కోర్టులను ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సత్వర న్యాయం అందడమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశారు. గ్రామ న్యాయాలయాల చట్టం 2009 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా అమల్లోకి వచ్చింది. ఈ కోర్టులకు క్రిమినల్, సివిల్ కోర్టులకుండే అధికారాలు ఉంటాయి. న్యాయాధికారిని హైకోర్టు సమ్మతితో రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. మార్చి 2015 నాటికి మనదేశంలో 194 గ్రామ న్యాయాలయాలు ఉన్నాయి. అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో గ్రామ న్యాయాలయానికి జూనియర్‌ సివిల్‌ జడ్జి లేదా జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (ఫస్ట్‌ క్లాస్‌ కేడర్‌) అధికారి గ్రామ న్యాయాధికారిగా ఉంటారు. ప్రతి గ్రామ న్యాయాలయంలో ఒక సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ విధులు నిర్వహిస్తారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2v94zSp

No comments:

Post a Comment