
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ హింసకు దారితీసి 34 మందిని బలితీసుకుంది. ఈ ఘటనలో మొత్తం 200 మంది గాయపడగా వీరిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారంతో పోలిస్తే గురువారం పరిస్థితి మరింత అదుపులోకి వచ్చింది. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లోని తమ పౌరులకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతోన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. Read Also: అల్లర్లపై తాజా సమాచారం, రహదారులు, మెట్రో స్టేషన్ల మూసివేత, కర్ఫ్యూ తదితర అంశాల గురించి ఎప్పటికప్పుడు స్థానిక మీడియాను వీక్షించాలని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రదేశాల్లో 144 సెక్షన్ కొనసాగుతోందని, నలుగురు కంటే ఎక్కువ మంది ఒకచోట చేరరాదని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు పేర్కొంది. భారీ ట్రాఫిక్ లేదా మూసివేసిన రహదారులు, ఆందోళనలు జరే ప్రదేశాలకు వెళ్లరాదని తెలిపింది. చుట్టూ ఉన్న పరిస్థితులను గమనించాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని, తాజా సమాచారం కోసం స్థానిక మీడియాను అనుసరించాలని కోరింది. Read Also: అమెరికా పౌరుల విదేశీ పర్యటనలను ఆ దేశ విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, ట్రావెల్ వార్నింగ్, అలెర్ట్ గురించి ప్రత్యేక సమాచారం పౌరులకు తెలియజేస్తుంది. విదేశాల్లో నివసించే, పర్యటించే తమ పౌరుల భద్రతా సమాచారం కూడా రాయబార కార్యాలయం వద్ద ఉంటుంది. హింసాత్మక ఘటనలు ఎక్కడైనా చెలరేగితే ట్రావెలర్స్ చెక్‌లిస్ట్ సమీక్షించుకోవాలని అప్రమత్తం చేస్తుంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2wJP5o6
No comments:
Post a Comment